కూతురు పెళ్లికి డబ్బుల్లేవని.. తండ్రి ఏం చేసాడో తెలుసా?

praveen
ఒకప్పుడు కూతురు పుడితే భారం గా భావించేవారు.. అందుకే కూతురుకు బదులు కొడుకు పుట్టాలని కోరుకునే వారు. ఒకవేళ కూతురు పుడితే చెత్తకుప్పలో పడేయడం లాంటివి కూడా చేసేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో మార్పు వచ్చింది.. ఎంతో మంది కూతురు పుడితే మహాలక్ష్మి పుట్టింది అని సంబరపడిపోతున్నారు. ఎంతో సంతోషంగా పుట్టిన కూతురు ని దగ్గరికి తీసుకొని ప్రేమగా చూసుకుంటున్నారు. కానీ నిరుపేద కుటుంబాల్లో మాత్రం కూతురు పుట్టడం ఆనందాన్ని ఇచ్చినప్పటికీ ఆ తర్వాత కూతురు పెద్దయ్ పెళ్లిడికి వచ్చిన తర్వాత మాత్రం కూతురు పెళ్లి చేయడం భాగంగానే మారిపోతుంది. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాల్లో కూతురి పెళ్లి అనే ఆలోచన వస్తే చాలు ఎంతో మందికి భయం పట్టుకుంటుంది.

 ఇటీవలి కాలంలో మారుతున్న జీవనశైలిలో ఇటు ఒకప్పుడు పెళ్ళి చేయడం తో పోల్చి చూస్తే ఇక ఇప్పుడు పెళ్లి చేస్తే దాదాపు లక్షల్లో ఖర్చు అవుతుంది. పేద మధ్య తరగతి కుటుంబాల్లో లక్షలు ఖర్చు పెట్టలేని పరిస్థితి. అదేసమయంలో ఇటీవల కాలంలో వరకట్నం  కూడా బాగానే ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది . దీంతో కూతురి పెళ్లి చేయాలనే ఆలోచన పేద మధ్యతరగతి కుటుంబంలో ఉన్న తండ్రికి భారంగానే మారిపోతుంది. ఇక్కడ ఇలాంటి ఆలోచనే ఒక తండ్రి ప్రాణం తీసింది. కూతురు పుట్టగానే ఆ తండ్రి ఎంతగానో సంబరపడిపోయాడు.

కూతురు బుడిబుడి అడుగులు వేస్తూ ఉంటే చూసి సంతోషం లో మునిగిపోయాడు. కూతురికి ఏ కష్టం రాకుండా పెంచాడు. నా కూతురే నా మహారాణి అని అనుకున్నాడు. కానీ కూతురు పెళ్లి కి వచ్చేసరికి ఆ తండ్రి లో భయం మొదలైంది. పేద కుటుంబంలో ఉన్న తాను కూతురు పెళ్లి ఎలా చేయాలి అన్న ఆలోచన ఆ తండ్రి మనసును తొలిచేసింది. దీంతో మనస్థాపంతో ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ లో వెలుగులోకి వచ్చింది. కూతురు పెళ్లి చేయాల్సి ఉండగా డబ్బు మాత్రం కుదరలేదు. తెలిసిన వారి దగ్గర డబ్బులు ప్రయత్నిస్తాను అని చెప్పి చివరికి ఉరివేసుకున్నాడు దౌల్తాబాద్ మండలం కి చెందిన బోయిని ఎల్లం అనే వ్యక్తి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: