హాట్ టాపిక్‌గా కృష్ణా టీడీపీ కీల‌క నేత దూకుడు ..!

VUYYURU SUBHASH
టీడీపీ మాజీ ఎమ్మెల్యే, యువ నాయ‌కుడు.. బోడే ప్ర‌సాద్ దూకుడు జోరుగా సాగుతోంద‌నే టాక్ వినిపిస్తోంది. కృష్ణాజిల్లా పెన‌మ లూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌తంలో గెలిచిన ఆయ‌న ప్ర‌స్తుతం యాక్టివ్‌గా ఉన్నారు. స‌మ‌స్య‌ల‌పై స్పందిస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్నారు. దీంతో ఏదైనా స‌మ‌స్య వ‌స్తే.. వెంట‌నే ప్ర‌జ‌లు ఆయ‌న వ‌ద్ద‌కు వ‌స్తున్నారు. దీంతో వారికి ప‌ల‌క‌రిం చి.. వారి స‌మ‌స్య‌లు విని.. వాటిని ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

అదేస‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గంలోనూఆయ‌న ప‌ర్య‌టిస్తున్నారు.  అయితే.. ఇటీవ‌ల కాలంలో బోడే చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై నియోజ‌క‌వ‌ర్గంలో చ‌ర్చ సాగుతోంది. ఇటీవ‌ల రాష్ట్ర ప్ర‌భుత్వం గ‌తంలో ప్ర‌భుత్వ  ప‌థ‌కం కింద ఇళ్లు నిర్మించుకున్న వారి బ‌కాయిల‌ను వ‌సూలు చేసుకునేందుకురెడీ అయింది. దీనిలో భాగంగా.. వ‌న్ టైం సెటిల్‌మెంట్‌ను అమ‌లు చేస్తోంది. అయితే.. దీనిని చాలా చోట్ల ప్ర‌జ‌లు వ్య‌తిరేకిస్తున్నారు. అయితే.. ఎక్క‌వ మంది అదికార పార్టీ నేత‌లే ఉండ‌డంతో ఎవ‌రూ ఈ విష‌యాన్ని ప‌ట్టించుకోవ‌డం లేదు.

అదేస‌మ‌యంలో టీడీపీ నేత‌లు కూడా పెద్ద‌గా ఈ విష‌యాన్ని ప‌ట్టించుకోవ‌డం లేదు. ఏదైనా ఉంటే.. చంద్ర‌బాబు చూసుకుంటార‌ని.. త‌మ‌కెందుకులే అనుకుంటున్నారు. దీంతో ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌జ‌లు ఈ విష‌యంపై గుంభ‌నంగానే చ‌ర్చించుకుంటున్నారు. అయితే.. ఇదే విష‌యంపై మాజీ ఎమ్మెల్యేగా ఉన్న బోడే ప్ర‌సాద్ రియాక్ట్ అయ్యారు. త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన వారితో ఈ విష‌యంపై చ‌ర్చించారు.

అయితే.. ఈ సంద‌ర్భంగా బోడే చేసిన  వ్యాఖ్య‌లు టీడీపీ నేత‌ల మ‌ధ్య, పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలోనూ చ‌ర్చ‌కు వ‌స్తున్నా యి. గ‌తంలో వైసీపీ అధినేత  జ‌గ‌న్ పాద‌యాత్ర చేసిన‌ప్పుడు.. చంద్రబాబు.. ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన అనేక ప‌థ‌కాల‌పై ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించేవారు. ఈ క్ర‌మంలో త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చేస్తుంద‌ని.. అప్పుడు ఆయా బిల్లులు, రుణాలు కూడా మాఫీ చేస్తామ‌ని.. ఆయ‌న చెప్పేవారు.

ఇప్పుడు.. బోడే ప్ర‌సాద్ కూడా ఇదే వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ``మీరెవ‌రూ బిల్లులు చెల్లించాల్సిన ప‌నిలేదు. వ‌చ్చేది టీడీపీ ప్ర‌భుత్వ‌మే.. అన్ని బిల్లుల‌ను మాఫీ చేస్తుంది. మీరంతా హ్యాపీగా ఉండండి. ఎవ‌రైనా అధికారులు బిల్లుల కోసం వ‌స్తే.. తిర‌గ‌బ‌డండి`` అని ఆయ‌న పిలునిస్తున్నారు..

దీంతో బోడే వ్యాఖ్యల‌పై.. నియోజ‌క‌వ‌ర్గంలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. నిజంగానే టీడీపీ అధికారంలోకి వ‌స్తుందా?  అనేది ఒక చ‌ర్చ అయితే.. మ‌రో చ‌ర్చ ఏంటంటే.. టీడీపీ అధికారంలోకి వ‌చ్చేందుకు(ఒక‌వేళ‌) ఇంకా.. రెండున్న‌రేళ్ల స‌మ‌యం ఉంద‌ని.. అప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వం ఊరుకుంటుందా? అధికారులు ఇబ్బంది పెట్ట‌కుండా ఉంటారా? అనే చ‌ర్చ సాగుతోంది.

మ‌రికొంద‌రు.. బోడే ప్ర‌సాద్ తెలివిగా త‌ప్పించుకుంటున్నారనే కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి పెన‌మ‌లూరులో  బోడే స్పందించార‌న్న ఒక్క సంతోషం మిన‌హా.. ఇక‌, మ‌రేమీ.. క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఆయ‌న వ్యాఖ్య‌లను న‌మ్ముకున్న వారి ప‌రిస్థితి ఏమ‌వుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: