భట్టిపై ఫోకస్ పెట్టిన తెరాస.. రాబోవు రోజుల్లో..!

MOHAN BABU
భట్టి విక్రమార్క పై కేటీఆర్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయా..? భట్టి పై గులాబీ దండు ఆకర్ష్ ప్రయోగం చేస్తుందా? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు  త్రిముఖ పోటీ నెలకొంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్లీ బలం పుంజుకున్నట్లు కనిపిస్తుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టిఆర్ఎస్,కాంగ్రెస్, బిజెపి మధ్య త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇతర పార్టీలోని బలమైన నేతలను తమ పార్టీలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న టిఆర్ఎస్ తాజాగా కాంగ్రెస్ ను దెబ్బ కొట్టేందుకు అదే వ్యూహాన్ని అమలు చేస్తోందని తెలుస్తుంది. కాంగ్రెస్లో ప్రస్తుతం సీఎల్పీ నేతగా ఉన్న బట్టి విక్రమార్క టీఆర్ఎస్ వైపు చూస్తున్నారని గతంలో వార్తలొచ్చాయి.

దళిత బంధు వంటి పథకాన్ని అమలు చేయడం ద్వారా  దళితుల్లో బలమైన నేతగా ఉన్న ఆయనను ఆకర్షించాలని టిఆర్ఎస్ చూస్తోందని టాక్ వినిపిస్తోంది. తాజాగా కేటీఆర్ మాటలు కూడా ఇందుకు ఊతమిచ్చేలా ఉన్నాయి. కాంగ్రెస్ లో భట్టి విక్రమార్క  మంచి వ్యక్తి అని కానీ అక్కడ గట్టి అక్రమార్కుల మాటే చెల్లుబాటవుతుందని  కేటీఆర్ అన్నారు. దీంతో భట్టివిక్రమార్క విషయంలో టిఆర్ఎస్ సాఫ్ట్ కార్నర్ తో ముందుకు  సాగుతోందని, ఆయనను తమవైపు తిప్పుకునేందుకు  ప్రయత్నిస్తోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు భట్టి విక్రమార్క పై టిఆర్ఎస్ అంతలా ఫోకస్ చూపించడానికి అనేక కారణాలున్నాయని  పలువురు చర్చించుకుంటున్నారు.మండలానికి చెందిన దళిత మరియమ్మ లాకప్ డెత్  విషయంలో న్యాయం చేయాలంటూ భట్టి సీఎం కేసీఆర్ ను కలిశారు. అప్పటి వరకు ఇన్ని ఆందోళనలు చేసిన స్పందించని సీఎం భట్టి కోరగానే ఆగమేఘాలమీద  మరియమ్మ కుటుంబానికి న్యాయం చేశారు. ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించడంతో పాటు మరియమ్మ కొడుక్కు ఉద్యోగం కూడా కల్పించింది.

 ఈ ఘటనలు ఇప్పుడు  చర్చనీయాంశంగా  మారాయి. దీంతో టీఆర్ఎస్ నేతలు భట్టి విక్రమార్క కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని దీని వెనుక పెద్ద కథే ఉందని అంటూ రకరకాల ప్రచారాలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు భట్టి తనను కావాలనే రచ్చ చేస్తున్నారు అని  గతంలో వ్యాఖ్యలు చేశారు. స్థానికంగా పట్టు ఉన్న భట్టి కి గులాబీ కండువా కప్పితే పార్టీ బలోపేతం కావడమే కాక కాంగ్రెస్ కు షాక్ ఇవ్వాలన్నది టిఆర్ఎస్ ఎత్తుగడగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: