దమ్ముంటే నా మీద గెలువు.. టిఆర్ఎస్ ఎమ్మెల్యే సవాల్?

praveen
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు వాడివేడిగా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయాలు అంతకంతకూ హాట్ హాట్ గా మారిపోతున్నాయి. ముఖ్యంగా హుజరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో అటు రేవంత్ రెడ్డి ఇటు బిజెపి నేతలు అందరూ కూడా టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇటీవలే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై టిఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్పందిస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ కేడి నెంబర్ వన్ అంటూ వ్యాఖ్యానించినా జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డి భేడి నెంబర్ వన్ అంటూ విమర్శలు గుప్పించారు.

 మా ముఖ్యమంత్రిపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదు అంటూ హెచ్చరించారు జీవన్రెడ్డి. డీఎస్ తన కొడుకులకు 500 కోట్ల ఆస్తి పంచి ఇచ్చారు కానీ సంస్కారం మాత్రం నేర్పించలేదు అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బాండ్ పేపర్ రాసిచ్చి మరి రైతులను మోసం చేసిన బడా చోర్ బీజేపీ ఎంపీ అరవింద్ అంటూ వ్యాఖ్యానించారు టిఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. దమ్ముంటే వచ్చి ఆర్మూర్ లో తన మీద పోటీ చేసి గెలవాలని అంటూ సవాల్ విసిరారు. ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తామని ధర్మపురి అరవింద్ హామీ ఇచ్చారని.. కానీ ఇప్పటివరకు పసుపు బోర్డు తీసుకురాలేదని.. ఆ ఊసే మర్చిపోయారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే గతంలో పసుపు బోర్డు తెస్తాను అంటూ అరవింద్ హామీ ఇచ్చిన వీడియోలను కూడా విడుదల చేశారు జీవన్రెడ్డి.

 మా ముఖ్యమంత్రి, మీద కేటీఆర్ మీద తప్పుడు మాటలు మాట్లాడితే అందరి పై పరువు నష్టం దావా వేస్తానంటూ హెచ్చరించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ దళిత బంధు ఆపితే అదేదో మేమే చేసినట్లుగా మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. ఎమ్మెల్సీ కవిత మీద కామెంట్ చేస్తే నిజాంబాద్ మహిళలు అందరూ కూడా చెప్పులు చీపుర్లతో కొడతారు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి మా నేతలతో అసలు పోలికే లేదని.. మాది కమిట్మెంట్ అయితే రేవంత్ రెడ్డి ది బ్లాక్ మెయిల్ అంటూ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ఒక స్టంట్ మాస్టర్ అంటూ విమర్శలు గుప్పించారు టిఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kcr

సంబంధిత వార్తలు: