ఈటల.. రఘుందన్ వార్నింగ్స్ తో ప్రచారం హీట్..!

NAGARJUNA NAKKA
హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారం హీట్ ఎక్కుతోంది. వివిధ పార్టీల నేతలు ప్రచారంలో చెలరేగిపోతున్నారు. రైతులు పండించిన ప్రతి గింజా కొనాలని.. లేకపోతే బండెనకబండి కట్టి ధాన్యం తీసుకొచ్చి సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో పోస్తామని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ చిటికెన వేలు అయితే మోడీ బొటన వేలులాంటి వాడని అభిప్రాయపడ్డారు.హుజూబాద్ లో ఆత్మాభిమానానికి, అహంకారానికి మధ్య పోటీ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
పోలింగ్ సమయం దగ్గర పడుతునన కారణంతో తాను ఏమీ మాట్లాడడటం లేదనీ.. పోలింగ్ తర్వాత ఎవరెవరు ఏం మాట్లాడారో వారిపై ప్రతీకారం తీర్చుకుంటానని హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. తాను కళ్లు తెరిస్తే మాడి మసైపోతారని ఆయన హెచ్చరించారు. తన వల్లే హుజూరాబాద్ కు దళితబంధు, పెన్షన్లు వచ్చాయని, పథకాలు ఇస్తోంది కేసీఆర్ అయినా.. తెచ్చింది తానేనని ఈటల పేర్కొన్నారు.
మరోవైపు హుజూరాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ తరఫున ఆ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్కం ఠాగూర్ ప్రచారం నిర్వహిస్తున్నారు. హుజూరాబాద్ లో పార్టీ సభ్యులు, సమన్వయ కర్తలతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. మహిళలతో నిర్వహించే సభలో పాల్గొంటున్నారు. రేపు చార్మినార్ దగ్గర రాజీవ్ సద్భావన యాత్రలో పాల్గొంటారు ఠాగూర్.
ఇక హుజూరాబాద్ లో పోటీ చేస్తున్న పలువురు అభ్యర్థులు తమ ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. వారు స్థానికులు కాకపోవడమే అందుకు కారణం. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ ఉమ్మడి కరీంనగర్ కు చెందిన వారు కాగా.. అన్న వైఎస్ కాంగ్రెస్ కు చెందిన మన్సూర్ మహ్మద్ నిజామాబాద్ వాసి, ఇక జైస్వరాజ్ పార్టీకి చెందిన కన్నం సురేశ్ స్వస్థలం మేడ్చల్, సీపీఐ,యూ పార్టీకి చెందిన కర్ర రాజిరెడ్డి స్వస్థలం శాయంపేట, ప్రజావాణి పార్టీకి చెందిన లింగిడి వెంకటేశ్వర్లు స్వస్థలం సూర్యపేట.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: