అమ్మా నాన్నలను బయటకు పంపితే క్రిమినల్ కేసు: కృష్ణా జిల్లా కలెక్టర్ స్ట్రాంగ్ వార్నింగ్

Sahithya
వృద్ధదంపతులు స్వేచ్ఛగా వారి సొంతఇంట్లో నివాసం ఉండొచ్చు  అని ప్రకటించారు కృష్ణా జిల్లా కలెక్టర్. ఆస్తి కోసం ఇంటి నుండి గెంటివేయబడ్డ వృద్ధ తల్లిదండ్రులకు తక్షణమే వారి సొంత ఇంటిలోనికి నివసించేందుకు పోలీసు రక్షణ కల్పించే విధంగా ఆదేశాలు జారీ చేసారు కృష్ణాజిల్లా కలెక్టర్ జె. నివాస్. జిల్లా కలెక్టర్ ఆదేశాలు అమలు పరుస్తూ ఆర్.పేట పోలీసు స్టేషన్ సీఐ భీమరాజు ఆధ్వర్యంలో వృద్ధ దంపతులను మచిలీపట్నం, జగన్నాధపురంలోని సొంత ఇంటిలో నివాసము ఉండేందుకు వీలు కల్పిస్తూ భరోసా ఇచ్చారు ఆయన.
మానవీయ కోణంలో, వృద్ధ దశలో ఉన్న తల్లిదండ్రులను బయటికి పంపి వేసిన పిల్లలకు కలెక్టర్ ఆదేశాలు ఇస్తూ గుణపాఠం చెప్పారు. పెద్ద కొడుకు చిత్రహింసలు భరించలేక బయటకు వెళ్ళి నాలుగు సంవత్సరాలనుండి అద్దెఇంట్లో వుంటున్న వృద్ధ దంపతుల కష్టాలు అడిగి ఆయన తెలుసుకున్నారు. ఒక సంవత్సరం క్రితం బందరు డి.ఎస్.పి ఆధ్వర్యంలో ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వృద్ధ దంపతులకు ఎదురు దెబ్బ  తగిలింది... అప్పుడు ఏమీ చేయలేని స్థితిలో  డి.ఎస్.పి వెనక్కు వచ్చేశారు.
కలెక్టరుకు వినతిపత్రం సమర్పించిన వెంటనే స్పందించిన కలెక్టర్ జె . నివాస్... చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ భీమరాజు మాట్లాడుతూ... ఆస్తి కోసం ఇంట్లో నుండి తల్లిదండ్రులను బయటకు పంపిన వృద్ధ దంపతులను రక్షణ కల్పిస్తాం అని ఈ సందర్భంగా స్పష్టం చేసారు. వాళ్ళు స్వేచ్ఛగా వారి ఇంట్లో నివాసం ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నాం అని ఆయన వివరించారు. వృద్ధ దంపతులు, వారి కుమారులకు కౌన్సిలింగ్ నిర్వహించాం అని వివరించారు. వృద్ధ దంపతులు సొంత ఇంట్లో నివాసం ఉండేందుకు ఎటువంటి ఆటంకం కలిగించినా వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తాం అని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇలాంటి ఇబ్బందులు వస్తే కచ్చితంగా తమ దృష్టికి తీసుకురావాలని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: