చిన్నారి చైత్ర : ఆత్మ గౌర‌వం అంటే ఇది?

RATNA KISHORE
 ఏం నేర్చుకోవాలి? :  
పేద‌లంటే చుల‌క‌న భావం ఉందా లేదా అన్న‌ది త‌రువాత ఈ పాల‌కుల‌కు ఆ పేద కుటుంబం చెప్పిన పాఠం మాత్రం జీవితాంతం మ‌రువలేం. తిండి లేక‌పోయినా పర్లేదు మా పాప‌కు మీరు ఇచ్చిన డ‌బ్బు వ‌ద్దు.. మాకూ వ‌ద్దు.. త‌ను ఉన్నా లేక‌పోయినా త‌ను మా మ‌ధ్యే ఉంద‌నుకుంటాం అని అంటున్నారీ పేద‌లు. మ‌నం ఎవ‌రిని చూసి ఏం  నేర్చుకోవాలి. క‌న్నీటి ధార‌ల చెంత ఏం నేర్చుకోవాలి.


 
ఇది ఒక ఆత్మ గౌర‌వ నినాదం.. ఇది ఒక పేద కుటుంబం చాటిన గొప్ప భావం. కూటికి లేక‌పోయినా గుణానికి తామేం త‌క్కువ కాద‌ని నిరూపించిన వైనం. ఈ స‌మాజం వీరి నుంచి ఏం నేర్చుకుంటుంది. తండాల నుంచి వ‌చ్చిన బిడ్డ‌ల‌ను చూసి మ‌నం ఏం నేర్చుకుంటున్నాం. డ‌బ్బులు వ‌ద్దు స‌ర్ న్యాయ‌మే కావాలి. గంజి నీళ్లు తాగి బ‌తికే కుటుంబాలు మావి. మాకు కావాల్సింది న్యాయ‌మే.. అని ఆ కుటుంబం ముక్త‌కంఠంతో ప్ర‌భుత్వాన్ని క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తూ వేడుకుంటోంది.
ఇంకా చెప్పాలంటే.. : చిన్నారి చైత్ర ను అత్యంత పాశ‌వికంగా చంపేసిన రాజు విగ‌త జీవిగా రైల్వే ట్రాక్ పై క‌నిపించాడు. ఘ‌ట్ కేస‌ర్ ప‌ట్టాల‌పై శ‌వ‌మై తే లాడు. ఈ కేసుకు సంబంధించి ఉన్న మిస్ట‌రీ కాస్త వీడిపోయింది.పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇదొక ఆత్మ హ‌త్య అని తేల్చేశారు. కానీ విజ‌య‌న‌గ‌రం చెందిన కుర్రాడు పోలీసుల వాద‌న‌తో ఏకీభ‌విస్తున్నారు. శ్రీ‌కాకుళంలో సైతం ఈ ఘ‌ట‌న చ‌ర్చకు వ‌చ్చింది. నిందితుడ్ని చంపేయాలన్న వాద‌న కూడా వినిపించింది. మ‌రోవైపు బాధిత కుటుంబం త‌మ‌కు డ‌బ్బులు వ‌ద్దేవ‌ద్ద‌ని చెప్పింది. డిప్యూటీ సీఎం మ‌హ‌మూద్ అలీ, మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ ఆ కుటుంబాన్ని క‌లిసి ప‌రామ‌ర్శించి, కేసీఆర్ ప్ర‌క‌టించిన ఇర‌వై ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్కును అందించారు. అయితే ఇది త‌మ‌కు వ‌ద్ద‌ని చైత్ర తండ్రి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tg

సంబంధిత వార్తలు: