ష‌ర్మిల ప్లాన్‌ రెండిటికి చెడ్డ రేవ‌డైందే ?

VUYYURU SUBHASH
తెలంగాణ‌లో చిన్నారి చైత్ర హ‌త్యాచార ఘ‌ట‌న‌పై రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల్లో పెద్ద చ‌ర్చ జ‌రిగింది. ఈ హృద‌య విదార‌క ఘ‌ట‌న ఎంతో మందిని క‌లిచి వేసింది. సినిమా వాళ్ల నుంచి రాజ‌కీయ నేత‌ల వ‌ర‌కు ఎవ‌రికి వారుగా సోష‌ల్ మీడియాలో ఆవేద‌న వెళ్ల‌గ‌క్కారు. క‌ట్ చేస్తే దీనిని క్యాష్ చేసుకుని రాజ‌కీయంగా మంచి మైలేజ్ ద‌క్కించుకోవాల‌ని వైఎస్ ష‌ర్మిల పెద్ద వ్యూహ‌మే ప‌న్నారు. ప‌రామ‌ర్శ‌కు వెళ్ల‌డంతో పాటు అక్క‌డే దీక్ష‌కు కూర్చోవ‌డంతో పాటు పెద్ద పెద్ద డిమాండ్లు ప్ర‌భుత్వం ముందు పెట్టారు. ఇవ‌న్నీ ఆమె చెప్ప‌డం ఏమోగాని.. సామాన్య జ‌నాలు కూడా ప‌ట్టించుకోలేదు. ఆమెకు ఈ విష‌యంలో ఎవ‌రో రాంగ్ గైడెన్స్ ఇచ్చారు. అయితే ఇందులో వాస్త‌వ‌, అవాస్త‌వాల గురించి ప‌ట్టించుకోని ష‌ర్మిల దానిని తూచా త‌ప్ప‌కుండా అమ‌లు చేశారు.
ఆమె ప్లాన్లు ఏవి అమ‌లు కాకుండానే ఆమెను పోలీసులు అక్క‌డ నుంచి త‌ర‌లించేశారు. బాధిత‌ కుటుంబానికి రూ. పది కోట్ల నష్టపరిహారం, సీఎం కేసీఆర్ స్పందించే వరకూ తాను సింగరేణి కాలనీలో దీక్ష చేస్తానని చెప్పిన ష‌ర్మిల‌ను పోలీసులు ఆమెను దీక్ష నుంచి ఇంటికి త‌ర‌లించేశారు. విచిత్రం ఏంటంటే దీక్ష ద‌గ్గ‌ర పార్టీ శ్రేణులు కూడా లేక‌పోవ‌డంతో ఆమె కూడా త‌న‌ను దీక్ష నుంచి ఎప్పుడు ఇంటికి త‌ర‌లించేస్తారా ? అని ఎదురు చూసిన‌ట్టు అక్క‌డ వాతావ‌ర‌ణం ఉంది. ఈ విష‌యం రాజ‌కీయం కావ‌డంతో ఆమె దీనిని త‌నకు అనుకూలంగా మ‌ల‌చు కోవాల‌ని అనుకున్నారు. అయితే ఆమె ప్లాన్ అంతా బెడిసి కొట్టేసింది. ఆమె దీక్ష‌కు, హ‌డావిడికి ఏ మాత్రం మైలేజ్ రాలేదు.
ప్ర‌భుత్వం చిన్న ప్ర‌క‌ట‌న చేసినా దానిని త‌న‌కు అనుకూలంగా మ‌ల‌చుకుని పెద్ద ప‌బ్లిసిటీ చేసుకోవ‌చ్చ‌ని భావించిన ష‌ర్మిల ఎంత క‌ష్ట ప‌డ్డా వ్ర‌తం చెడింది.. ఫ‌లిత‌మూ ద‌క్క‌లేదు అన్న‌ట్టుగా ప‌రిస్థితి రివ‌ర్స్ అయ్యింది. పైగా ఈ విష‌యంలో ఆమె లేని పోని విమ‌ర్శ‌లు కొని తెచ్చుకున్నారు. ఆమె కేవ‌లం రాజ‌కీయం చేసేందుకే అక్క‌డ‌కు వెళ్లి న‌ట్టు ఉన్నార‌ని.. ఆమె డిమాండ్లు చూస్తేనే ఆ గొడ‌వేంటో, ఆ లోకం ఏంటో తెలుస్తోంద‌ని ప‌లువురు సెటైర్లు పేలుస్తున్నారు. అయినా కేసీఆర్ ముందు ఇలాంటి ఊక‌దంపుడు డిమాండ్లు పెడితే ఆయ‌న ఎంత వ‌ర‌కు ప‌ట్టించు కుంటారన్న‌ది ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: