జగన్ సొంత నియోజకవర్గంలో ఇంత దారుణాలా...?

Sahithya
టీడీపీ నేతలు స్పీడ్ పెంచేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెట్టె ప్రయత్నం చేస్తున్నారు. రైతుల సమస్యలకు సంబంధించి టీడీపీ నేతలు ఎక్కుపెడుతున్న బాణాలు సర్కార్ ను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. టీడీపీ కీలక నేతలు కొందరు ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం కూడా గట్టిగా చేస్తున్నారు. టీడీపీ శాసనమండలి సభ్యులు మారెడ్డి రవీంధ్రనాధ్ రెడ్డి (బీటెక్. రవి) నేడు కీలక వ్యాఖ్యలు చేసారు. పులివెందుల నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులకు సంబంధించి ఆయన ఘాటుగా వ్యాఖ్యలు చేసారు. వైసీపీ పాలనలో కరువు, అరువుతో అన్నదాతల ఆత్మహత్యలు, రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రంలో పులివెందుల నెం1 స్ధానంలో లో ఉంటే దేశంలో ఏపీ నెం.2 స్ధానంలో ఉంది అని ఆయన ఆరోపించారు.
దేశంలో ఎక్కడైనా అరటి కేజీ రూ. 4 కి, టమెటా రూ.1కి, చినీ కేజీ రూ. 15 కి  దొరుకుతుందా? ఈ ధరలు దేశంలో ఒక్క పులివెందులలో మాత్రమే ఉన్నాయి అని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత నియోజకవర్గంలో దళారులతో వైసీపీ నేతలు కుమ్మక్కయి రైతులను దోచుకుంటున్నా.. ముఖ్యమంత్రి పట్టించుకోవటం లేదు అని విమర్శలు చేసారు. వైసీపీ పాలనలో పంట వేయడానికి పెట్టుబడికి అరువు పుట్టక కరువుకు పంటలు సరిగా పండక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అన్నారు.
విత్తనం నాటిన రైతు ఆ పంటను విక్రయించే నాటికి ప్రాణాలతో ఉండే పరిస్థితి లేదు అని విమర్శించారు ఆయన. ఓదార్పు యాత్ర పేరుతో రాష్ట్రమంతా తిరిగిన జగన్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో ఆత్మహత్యలకు పాల్పడ్డ అన్నదాతల కుటుంబాల్ని ఎందుకు పరామర్శించ లేదు?   అని బీటెక్ రవి నిలదీశారు.  టీడీపీ 5 ఏళ్ల పాలనలో రైతులకు ఏం చేశామో, వైసీపీ రెండున్నరేళ్ల పాలనలో మీరేం చేశారో బహిరంగ చర్చకు వైసీపీ నేతలు సిద్దమా? అంటూ ఆయన సవాల్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: