శ్రీ‌కాకుళం వార్త : ఆ అధికారి ఇక్క‌డ పోటీ చేసి ఉంటే ?

RATNA KISHORE
ఉద్దానం ప్రాంత స‌మ‌స్య‌పై ఎంతో ప‌నిచేసిన జ‌న సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ అటుపై కొన్ని కీల‌క మార్పుల‌కు కార‌ణం అయ్యార‌న్న‌ది నిజం. నిరంతరం త‌న కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడుతూ వాస్త‌విక స్థితిగ‌తుల‌పై ప్ర‌భావితం చేసే అంశాల గురించి తెలుసుకునేవారు. రాజ‌కీయంగా కాకుండా ఈ స‌మ‌స్య‌ను సామాజికంగానే చూడాల‌ని త‌రుచూ విన్న‌వించారు. ఆ విధంగా జ‌న‌సేన ప్ర‌జ‌ల‌పై తీవ్ర ప్ర‌భావాన్ని చూపింది. ప‌వ‌న్ కూడా ఎక్క‌డ రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు తావివ్వ‌క ప్ర‌భుత్వాలు ఏం చేయాలో అన్న‌ది బాధితుల‌తో ఆ రోజు నేరుగా మాట్లాడాకే స్పందించేవారు. ఇచ్ఛాపురం వ‌చ్చాక ప‌వ‌న్ ఎంద‌రో బాధితులతో ఫేస్ టు ఫేస్ ముచ్చ‌టించి, వారి ఆరోగ్యంకు సంబంధించి వైద్యులు చెప్పిన వివ‌రాలు, టెస్టు రిపోర్టులు ఇలా అన్నింటినీ చ‌దివి వెళ్లారు.

ఎన్టీఆర్ హెల్త్ వ‌ర్శిటీ పెద్ద‌లే కాదు స్థానిక వైద్యుల‌తోనూ మాట్లాడి నేరుగా వేదిక‌పై నుంచే ఏం చేయాలో ప్ర‌భుత్వాల‌కు సూచించేవారు. ఇవ‌న్నీ పూర్తి స్థాయిలో కాక‌పోయినా కాస్త‌యినా ఫ‌లించాయి. అందుకే ఉద్దానం ప‌ల్లెల‌లో ప‌వ‌న్ కు క్రేజ్ అనూహ్య రీతిలో పెరిగిపోయింది. ఇవ‌న్నీ గ‌మ‌నించి టీడీపీ జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌ను ప్ర‌త్యేకించి టార్గెట్ చేయ‌డం మొద‌లుపెట్టింది. స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ మ‌నుషులు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌పై భౌతిక దాడుల‌కు కూడా దిగారు. వీటికి కార‌ణాలు ఏవ‌యినా చంద్ర‌బాబు స‌ర్కారు ఆ రోజు ప‌వ‌న్ చెప్పిన నాలుగు మంచి మాట‌ల‌ను ఆచ‌రించింది. ఇదే క్ర‌మంలో జ‌న‌సేన త‌రువాత జేడీ ఇక్క‌డికి వ‌చ్చారు. కిడ్నీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న కొంద‌రితో మాట్లాడ‌డం, అటుపై నిపుణుల‌తో చ‌ర్చించ‌డం వంటివి చేశారు. దీంతో ఆయ‌న కూడా ప్ర‌జ‌ల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నారు. అప్ప‌టికి ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ప‌వ‌న్ త‌ప్పుకుంటే జేడీ ఇచ్ఛాపురం నుంచి పోటీ చేస్తార‌న్న వార్త‌లు వ‌చ్చాయి. అవి కూడా నిజం కాద‌ని తేలిపోయాయి.



సీబీఐ విభాగంలో ప‌నిచేసి, జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసునే కాదు రాజ‌శేఖ‌ర్ రెడ్డి హెలికాప్ట‌ర్ ప్ర‌మాదం కేసుకు సంబంధించిన ద‌ర్యాప్తును కూడా చేపట్టిన ఉన్న‌త స్థాయి అధికారి జేడీ లక్ష్మీనారాయ‌ణ పేరు ఉమ్మ‌డి రాష్ట్రంలో ఎంతో సుప‌రిచితం. ఉద్యోగానికి స్వ‌చ్ఛంద విర‌మ‌ణ ఇచ్చి, రాజ‌కీయాల్లోకి రావాల‌న్న ఆలోచ‌న‌తో అడుగులు వేస్తున్న క్ర‌మంలో జేడీ కూడా ఆ రోజు శ్రీ‌కాకుళం నుంచే ప్ర‌స్థానం ప్రారంభించారు. ఆ రోజు జ‌న‌సేన త‌రువాత ఇచ్ఛాపు రంతో పాటు మిగ‌తా ఉద్దాన ప్రాంతంలో నెల‌కొన్న కిడ్నీ వ్యాధి తీవ్ర‌త‌పై అధ్య య‌నం చేసేందుకు ముందుకు వ‌చ్చారు జేడీ. అదే విధంగా ఇచ్ఛాపురం ప‌రిస‌ర ప్రాంతాల‌లో ముఖ్యంగా క‌విటి మండ‌లంలో ఓ గ్రామాన్ని ద‌త్త‌త తీసుకుని సంబంధిత ప‌నులు కూడా చేప‌ట్టారు. ఓ ద‌శ‌లో జేడీ కూడా ఇచ్ఛాపురం నుంచి పోటీ చేస్తార‌న్న వార్త‌లు వ‌చ్చాయి. త‌రువాత ప‌రిణామాల్లో భాగంగా ఆయ‌న జ‌న‌సేన‌లో చేరిన‌ప్ప‌టికీ పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేక‌పో యారు. మొన్న‌టి ఎన్ని క‌ల్లో విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: