బేగంపేట ఎయిర్ ఫోర్ట్ ఏవియేషన్ యూనివర్సిటీగా మారబోతుందా..?

MOHAN BABU
 తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుంచి ఎన్నో అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరుగుతున్నాయి. ఎలాంటి అభివృద్ధి పనైనా శరవేగంగా జరుగుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఓ వైపు కేసీఆర్ మరోవైపు కేటీఆర్, ఇంకోవైపు హరీష్ రావు, ఇతర మంత్రులు రాష్ట్రాన్ని మొత్తం తిడుతూ  సభలు సమావేశాలు పెడుతూ సమస్యలపై  తీవ్రంగా గలమెత్తి తోంది. ఓ వైపు హైదరాబాద్ ఎలక్షన్ల పై దృష్టి పెడుతూనే, మరోవైపు రాబోయే ఎన్నికల పై ఇలా ఎలాగైనా వంద శాతం సీట్లు సాధించాలని  ఇంకా ప్రగతి సాధించాలని  సీఎం కెసిఆర్ నేతృత్వంలో వ్యూహాలు రచిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఆ దిశగానే అభివృద్ధి పనులకు కూడా చాలా వేగంగా చేస్తూ ప్రజల యొక్క మన్ననలు పొందేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారని చెప్పవచ్చు. అలాగే రాష్ట్రంలో కొత్త కొత్త పథకాలతో ప్రజల దృష్టిని ఆకర్షిస్తూ టిఆర్ఎస్ అంటేనే  ఒక బ్రాండ్ ఇమేజ్
తెస్తు ముందుకు వెళ్తున్నారు.

ఈ దిశగానే మంత్రి కేటీఆర్ బేగంపేట విమానాశ్రయాన్ని ఏవియేషన్ యూనివర్సిటీ గా  మార్చాలని కోరుతూ కేంద్ర మంత్రి అయినా జ్యోతిరాదిత్య సింధియాను కోరారు. దీంతోపాటుగా  యూరో స్పేస్ టెక్నాలజీ అనే శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని  ఆయన వివరించారు. మీ జరిగితే తెలంగాణ రాష్ట్రంతోనే పాటు దేశం మొత్తం యువతీ యువకులకు ఉపయోగపడుతుందని సింధియాకు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక అయినటువంటి హరితహారం కార్యక్రమాల్లో డ్రోన్ టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నారని ఆయనతో చెప్పారు. యొక్క డ్రోన్ల సహాయంతో అటవీ ప్రాంతంలోని సీడ్ బాల్స్ విత్తనాలను వెదజల్లి, వీటి ద్వారా 50 లక్షల మొక్కలను పెంచాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఉన్నదని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కు కేటీఆర్ తెలిపారు.

ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి అయిన సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ మెడిసిన్ ఫ్రమ్ స్కై అనే కార్యక్రమానికి వికారాబాద్ జిల్లాను ఎంచుకున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్యే యాదయ్య, రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎంపీ  గడ్డం రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణి రెడ్డి, కలెక్టర్  నిఖిల, తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: