మోడీ కేసీఆర్ మధ్య భేటీ: ఆ పార్టీ గురించే చర్చ: రేవంత్ బాంబు

Gullapally Rajesh
కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీతో తెలంగాణా కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... జరిగిన సమావేశంలో రాష్ట్రంలో పార్టీ బలోపేతం గురించి చర్చించాము అన్నారు. నూతన పిసీసీ కమిటీ ప్రకటన తర్వాత ధన్యవాదాలు చెప్పడానికి రాహుల్ గాంధీ సమయం ఇచ్చారు అని తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు అని ఆయన పేర్కొన్నారు. టీఎఆర్ఎస్ 7 సంవత్సరాల పాలనలో రాష్ట్రంలో ఎందరో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు అన్నారు.
ప్రతి మూడు నెలలకు ఒకసారి తెలంగాణ లో పర్యటించమని రాహుల్ గాంధీని కోరాము అని డిసెంబరు 9 నుండి రాష్ట్రంలో పార్టీ నిర్మాణంకోసం సభ్యత్వకార్యక్రమం ప్రారంభిస్తాం. దానికి రాహుల్ గాంధీని ఆహ్వానించాము అని ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీ సూచనలు, సలహాల మేరకు రాష్ట్రంలో పార్టీ తరపున ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నామని ఆయన వివరించారు. దళితులు, ఆదివాసులు, గిరిజనులను తప్పుడు ప్రకటనలతో కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారు అని మండిపడ్డారు. రాష్ట్రంలో పెద్ద సమస్య కల్వకుంట్ల కుటుంభమే అని మండిపడ్డారు.
వారం రోజుల కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ ఏం సాధించారు? అని ఆయన నిలదీశారు. ఇటీవల కేసీఆర్ , కేటీఆర్ మతిస్థిమితం కోల్పోయినట్లు కనబడుతున్నారు అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ, త్యాగాల ప్రతీక అమరవీరుల స్థూపం కానీ పార్టీ ఆఫీసులు కాదు అని ఆయన ఆరోపించారు. ఢిల్లీ లో అమరవీరుల స్థూపానికి కేంద్ర ప్రభుత్వం ఒక ఎకరం స్థలం కేటాయించాలి అని కోరారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో ఎంఐఎం ఎన్ని స్థానాలలో పోటీచేయించాలనే విషయం పై కేసీఆర్, మోడిల మధ్య చర్చ జరిగింది అన్నారు. కేసీఆర్ , మోడీల మధ్య ఉన్న ఫెవికాల్ బంధంలో బండి సంజయ్, ఈటెల బంధీలయ్యి బలి బకర అయ్యారని సంజేయ్,ఈటెల మోకాళ్ళ చిప్పలు అరిగేలా తిరిగిన ప్రయోజనం లేదు అని ఎద్దేవా చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts

సంబంధిత వార్తలు: