2024 ల‌క్ష్యంగా మోడీ-కేసీఆర్ ప్లాన్ అదేనా..?

Paloji Vinay
 రాజ‌కీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు.. నిన్న‌టి వ‌ర‌కు తిట్టుకున్న పార్టీలు ఇవ్వాల క‌లిసిపోవ‌డం మామూలే. అదే కోణంలో బీజేపీ-టీఆర్ఎస్ లు త‌మ వ్యూహాలను మార్చుకుంటున్నారా.? అంటే ఇటీవ‌లి ప‌రిణామాలు చూస్తే అది నిజం కావొచ్చ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇటీవల కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో తెలంగాణ భ‌వ‌న్ కు భూమి పూజ చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర పెద్దలు బీజేపీ దిగ్గజ నాయకులు.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యారు సీఎం కేసీఆర్‌. ఈ సందర్భంగా అనేక అంశాలు చర్చకు వచ్చాయని తెలుస్తోంది. అయితే.. ఏఏ విష‌యాల‌ను చ‌ర్చించార‌నేది బ‌య‌ట‌కు రాలేదు. కానీ రాజ‌కీయంగా ఈ భేటీలు ఆస‌క్తి క‌లిగిస్తున్నాయి.

    ఉన్నత స్థాయిలో ఉన్న బీజేపీ పెద్దలు, ముఖ్యంగా ప్ర‌ధాని మోడీ అపాయింట్‌మెంట్ ఇచ్చారంటే దీనివెనుక ఖ‌చ్చితంగా స్వ‌ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఈ కోణంలో మోడీ-కేసీఆర్ ల‌ భేటీ వెనుక కూడా రాజకీయ కార‌ణాలు ఉండొచ్చ‌ని ప్ర‌చారం సాగుతోంది. దేశంలో జమీలి ఎన్నిక‌లు ఇప్పట్లో వచ్చే అవకాశం క‌నిపించ‌డం లేదు. దీంతో 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల విష‌యంలో కేసీఆర్-మోడీల మధ్య సుదీర్ఘ చర్చ జరిగి ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. అయితే, దేశ వ్యాప్తంగా మోడీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేక‌త పెరుగుతున్న నేప‌థ్యంలో రాబోయే ఎన్నిక‌ల్లో బీజేపీ పార్టీయేత‌ర పాలిత రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ముఖ్య‌మంత్రుల స‌పోర్ట్ ఇప్పుడు బీజేపీకి అవ‌స‌రం.
 

  ఇక వ‌చ్చే ఏడాది అత్యంత కీల‌క‌మైన పెద్ద రాష్ట్రం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అలాగే నాలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నిక‌లున్నాయి. వీటిలో ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇక వచ్చే ఏడాది అత్యంత కీలకమైన పెద్దరాష్ట్రం ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి. దీనికితోడు మరో నాలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు ఉన్నాయి. వీటిలో బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ ఓట‌మి పాల‌యితే రాబోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి విజ‌యం క‌ష్ట‌మ‌వుతుంది. దీంతో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గిపోతాయి. ఈ నేప‌థ్యంలో త‌మ‌కు మ‌ద్ద‌తు ఇచ్చే పార్టీల‌ను అక్కున చేర్చుకునేందుకు బీజేపీ అధినాయ‌క‌త్వం ఆ దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్టింది.
 
  ఈ నేప‌థ్యంలో మోడీ - కేసీఆర్ ల భేటీలో విజ‌న్ 2024 పై ప్ర‌త్యేక చ‌ర్చ జ‌రిగిన‌ట్టు స‌మాచారం. కేంద్రంలో ప్ర‌భుత్వం ఏర్పాటుకు కేసీఆర్‌ను మోడీ మ‌ద్ధ‌తు కోరిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. ఈ క్ర‌మంలో రాష్ట్రంలో అధికారంలో వ‌చ్చేందుకు బీజేపీ అడ్డుప‌డ‌కూడ‌ద‌ని కేసీఆర్ ష‌ర‌తు పెట్టిన‌ట్టు రాజకీయ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: