హుజూరాబాద్ ఉప ఎన్నికను కేసీఆరే వాయిదా వేయించారా?

Mekala Yellaiah
‛కొట్టినట్టు చేయ్.. ఏడ్చినట్టు చేస్తా..’ అన్నట్టుగా టీఆర్ఎస్, బీజేపీ మిత్రుత్వం కొనసాగుతోంది. రాష్ట్రంలో కయ్యం పెట్టుకున్నట్టు కనిపిస్తున్నా కేంద్రంలో సఖ్యతగా ఉంటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన అధికారాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి వారినైనా మేనేజ్ చేస్తారు. హిందూ ఎజెండా బలం పెరుగుతుండడంతో రాజ్యాంగ సంస్థలు కూడా మోడీ, కేసీఆర్ ద్వయానికి తలొగ్గుతున్నాయి. ఎన్ని వరాలు గుప్పించినా, ఎంతగా ప్రలోభపెట్టినా హుజూరాబాద్ లో వ్యతిరేకతను పసిగట్టిన కేసీఆర్.. జనంలో సానుకూలత కోసం ఎత్తులు వేస్తున్నారు. ఏంచేసైనా హుజూరాబాద్ లో గెలవాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారు. అయినా ప్రజలు అనుకూలంగా లేరని ఇంటెలిజెన్స్ రిపోర్టులు తెలపడంతో కేసీఆర్ మరింత అప్రమత్తమయ్యారు. పార్టీ కార్యాలయానికి భూమి పూజ, ఇతర అధికారిక పనుల పేరుతో బీజేపీని, ఎన్నికల కమిషన్ ను మేనేజ్ చేసేందుకు ఢిల్లీ వెళ్లారు. ఆయన అక్కడ ఉన్నప్పుడే హుజూరాబాద్ ఉప ఎన్నిక వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. దసరా తరువాతనే ఎన్నిక నిర్వహిస్తామని తెలిపింది. ఈలోపు కేసీఆర్ బతుకమ్మ చీరల పంపిణీతో పాటు మరిన్ని తాయిలాలు ప్రకటిస్తారు. ప్రజలను అనుకూలంగా మలుచుకుంటారు. ఇంకోవైపు కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇతర బీజేపీ పెద్దలను కలిసి ఈటల రాజేందర్ ను ఒంటరి చేసే ఎత్తుగడలు వేశారు. ఇప్పటికే ఈటలకు మద్దతుగా హుజూరాబాద్ లో బీజేపీ పెద్దలు ప్రచారం చేయడంలేదు. కేసీఆర్ తన రాజకీయ కుతంత్రంతో ఈటల రాజేందర్ వ్యవహారశైలి గురించి ప్రధానమంత్రి నరేంద్రమోడీకి తప్పుడుగా చెప్పినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఈటల బీఎస్పీకి అనుకూలంగా ఉంటున్నారని, ఆయనను హుజూరాబాద్ లో ఓడించాలని డీల కుదుర్చుకొని ఉంటారంటున్నారు. ఇందులో మొదటి పావు ఎన్నిక వాయిదా అని చెబుతున్నారు. టీఆర్ఎస్ పుట్టింది మొదలూ పాలనా పగ్గాలు చేతబట్టిన నుంచీ జరుగుతున్న ప్రతి అధికార, అనధికార,  రాజకీయ ఎపిసోడ్ ల వెనుక, రాష్ట్రంలో అమలవుతున్న పథకాల మాటునా కేసీఆర్ సొంత ప్రయోజన ఎజెండానే దాగి ఉంటుంది. దేనినో చూసి విసిరిన ‛ఈటె’ గురితప్పి, మొన దేలి, వాడిగా మారి తనవైపే దూసుకువస్తుండడంతో కేసీఆర్ ఇలాంటి అస్త్రాలను సిద్ధం చేసుకొని దెబ్బతీయాలనుకుంటున్నారు. ఈ పరిణామాలు ఎటువైపు దారితీసి, ఎవరికి మేలు చేస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: