కేటీఆర్ టాక్ షో : షర్మిలకు కౌంటర్ ..

RATNA KISHORE
ఉద్యోగాలు అందరివీ
కాదు కొందరికే!
ఈ యుద్ధం ఇప్పట్లో ఆగదు
ప్రయివేటు ఉద్యోగాలు కొన్ని, ప్రభుత్వ ఉద్యోగాలు కొన్ని తమ ప్రభుత్వం తీసుకువచ్చిందని కేటీఆర్ చెబుతుంటే, అది అబద్ధం అ ని షర్మిల అంటున్నారు. పోనీ ఆయన చెప్పిందే అబద్ధం అనుకుందాం..అప్పుడు నిజం ఏంటి? ఆమెకు తెలిసినా లేదా ఆమె తన వర్గాల ద్వారా సేకరించిన నిజం ఏంటి? అన్నది అయినా చెప్పాలి. ప్రవేటు సంస్థల ద్వారా 15 లక్షల మందికి ఉపాధి ఇచ్చామని ప్రభుత్వం లెక్క. కానీ ఇవి అంకెల గారడీ అని షర్మిల మాట. ఈ లెక్కల్లో కూడా వాస్తవం ఉందా? లేదా కేవలం ఇవి  అంకెల గార డీనా? వీటిపై కూడా షర్మిల నిజ నిర్థారణ చేసుకోవాలి. ఇవేవీ చేయకుండా మాట్లాడడం తగదు.
వాస్తవాలను పోల్చండి
వాస్తవాలను తెలుసుకోండి
పాలక వర్గాల శక్తి, పాలక వర్గాల యుక్తి అన్నవి కేవలం మాటలతోనే తేలిపోదు. కానీ ఆచరణకు నోచుకోని మాటలే  నాయకుల కొంపలు ముంచుతాయి. తెలంగాణ ఏర్పడ్డా క లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని కేటీఆర్ చెబుతుంటే అదేమీ లేదని షర్మిల అంటున్నారు. తమ పరిధిలో చేపట్టిన కొన్ని మార్పుల కారణంగా వివిధ కంపెనీలు తెలం గాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముం దుకు వచ్చాయని స్పష్టం చేశారు. మౌలిక వసతుల కల్పన, కొన్ని అనుమతులను వేగవంతం చేయడం కారణంగా 2.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అంటున్నారు. ఈ మాటల్లో వాస్తవం క్షేత్ర స్థాయి పరిశీలనతోనే సాధ్యం. అందుకు షర్మిల పూనుకో వాలి. ఆమె కేవలం దీక్షలు చేసి ప్రభుత్వాలను ఇరకాటంలో పెట్టే కన్నా వాస్తవాలను తెలుసుకునేందుకు ప్రయత్నం ఎక్కువ చేయాలి. కానీ అవేవీ లేకుండా మాట్లాడి కేసీఆర్ నో, కేటీఆర్ నో ఢీ కొనడం సాధ్యం కాదు. సా హసం అంత కన్నా కాదు.
ఇదే సమయంలో..
రుద్రారం కేంద్రంగా..
అందరికీ ఉద్యోగాలు సాధ్యం కాని పని! అని అంటున్నారు కేటీఆర్. మరి! నీళ్లూ - నియామకాలూ - నిధులు పేరిట సాగించిన ఉ ద్యమానికి అర్థం ఏంటి? ఇది విపక్ష నేతల ప్రశ్న. ఈ తరుణాన ఆత్మ హత్యలు లేని తెలంగాణ నిర్మాణం అన్నది సాధ్యం చేయడం పాలకుల కర్తవ్యం కావాలి. కానీ ఇప్పటికీ అశాంతి.,ఆందోళన అన్నవి తెలంగాణను వెన్నాడుతున్నాయి. కొత్త పార్టీలు కూడా పాత సమస్యలపై యుద్ధం చేసి తమ పోరు బాట సాగించాలని యో చిస్తున్నాయి. తమ ఉనికికి ఇవే ఆధారం అవుతాయి అని న మ్ముతున్నాయి. ఇప్పటిదాకా ఓ లెక్క ఇకపై ఓ లెక్క అన్న తరహా లో సినిమా డైలాగులు చెబుతున్నాయి. ఇదే సందర్భంలో కేటీఆర్ తనదైన కౌం టర్ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా, రుద్రారం గీతం కాలే జ్ లో ఏర్పాటుచేసిన ఇంట్రాక్షన్ సెషన్ కు హాజరైన సందర్భం గా..ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: