బర్త్ డే రోజే బండి సంజయ్ కి షాక్ ఇచ్చిన అధికారులు ?

Veldandi Saikiran
నేడు... తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పుట్టిన రోజు అన్న సంగతి  విధితమే. అయితే బర్త్డే రోజే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కు సొంత జిల్లాలోనే ఊహించని షాక్ తగిలింది. అసలు వివరాల్లోకి వెళితే.... అధ్యక్షుడు బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లాలో.... ఇవాళ ఆయన పుట్టిన రోజు వేడుకలను బిజెపి పార్టీ  కార్యకర్తలు, సీనియర్ నాయకులు మరియు ఆయన అభిమానులు చాలా ఉత్సాహంగా జరిపారు. గల్లీ గల్లీలో బండి సంజయ్ ఫ్లెక్సీలు, కటౌట్లతో నింపేశారు ఆయన అభిమానులు. 

అంతే కాదు డీజే సౌండ్ సిస్టం ఏర్పాటు చేసి నానా రచ్చ చేశారు. అయితే ఇక్కడే అసలు వివాదం మొదలైంది.  ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బండి సంజయ్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని... కరీంనగర్ మున్సిపల్ అధికారులు చాలా సీరియస్ అయ్యారు. అక్కడితో ఆగకుండా... తమ సిబ్బందితో బండి సంజయ్ కుమార్... ఫ్లెక్సీలను, కటౌట్లను తీసే ఇచ్చే ప్రయత్నం ఉన్నతా ధికారులు. ఈ విషయం తెలియడంతో కరీంనగర్ బిజెపి నాయకులు మండిపడ్డారు. అంతేకాదు ఘటనా స్థలానికి వచ్చి... ఉన్నతాధికారులను అడ్డుకొని వారితో వాగ్వాదానికి దిగారు. మా ఫ్లెక్సీలు ఎలా తొలగిస్తారు అంటూ అధికారులను బిజెపి నాయకులు నిలదీశారు. అంతేకాదు ఉన్నతాధికారులపై చిందులేశారు.

దీంతో వివాదం కాస్త పెద్దదిగా అయింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఆ వివాదాన్ని అర్థం చేసుకున్న పోలీసులు బీజేపీ నాయకులకు సర్దిచెప్పి..... ఆ వివాదాన్ని కాస్త చల్ల పరిచారు. అనంతరం బిజెపి నాయకులు మీడియాతో మాట్లాడుతూ... ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పుట్టిన రోజు వేడుకలను ఎలా అడ్డుకుంటారని అధికారులను నిలదీశారు. అంతేకాదు.. కావాలనే టిఆర్ఎస్ ప్రభుత్వం విపక్ష నేతల పై దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలోని ఉన్నతాధికారులు మొత్తం సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: