అందరికీ మే13న ఓట్లు.. వాళ్లకు మాత్రం మే3నే..?

Chakravarthi Kalyan
ఫారం-12 సమర్పించిన వారు నియోజకవర్గాల్లో ఏర్పాటయ్యే ఫిసిలిటేషన్‌ కేంద్రాల్లో మే 3నుంచి 8వ తేదీలోపు వారు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఎన్నికల విధులు నిర్వర్తించే సుమారు 40 వేల మంది అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు  వేసేందుకు వీలుగా  ఆయా శాఖలన్నింటికీ ఫారం-12ను  జీహెచ్ఎంసీ అధికారులు చేరవేశారు. వచ్చిన దరఖాస్తులు లెక్కించి సంబంధిత నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారులకు చేరవేస్తారు.
ఎంపీ అభ్యర్థుల తుది జాబితాపై ఈనెల 29న స్పష్టత వచ్చాక నియోజకవర్గాల బ్యాలెట్‌ పేపరు ముద్రిస్తారు. ఇతర ప్రాంతాల్లో ఓటు హక్కు ఉండి ఇక్కడి పార్లమెంటు పరిధిలో ఎన్నికల విధుల్లో ఉంటే ఇక్కడే ఓటు వేయాలా? తమ జిల్లాలో ఓటు వేస్తారా అనేది ముందుగా ఫారం-12లో పేర్కొనాలి. దీని ఆధారంగా సంబంధిత ఆర్వో తపాలా ఓటు కోరిన ఉద్యోగుల ఓటరు జాబితాను రూపొందించి ఫిసిలిటేషన్‌ కేంద్రం రిజిస్టర్‌లో పేరు చేరుస్తారు. ఇందుకు చకచకా  ఏర్పాట్లు సాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: