కొడాలికి నంద‌మూరి బ్రాండ్‌తో చెక్ ?

VUYYURU SUBHASH
గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంకు తెలుగు రాజ‌కీయాల్లో ఉన్న ప్ర‌త్యేక‌త వేరు. తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కులు , మాజీ ముఖ్య‌మంత్రి దివంగత ఎన్టీఆర్ సొంత నియోజ‌క‌వ‌ర్గం గుడివాడ‌. పై గా ఆయన ఇక్క‌డ నుంచి రెండు సార్లు అసెంబ్లీకి ప్రాథినిత్యం వ‌హించారు. ఆ త‌ర్వాత కూడా గుడివాడ టీడీపీకి కంచుకోట‌గా ఉంటూ వ‌చ్చింది. రావి ఫ్యామిలీలో తండ్రి, ఇద్ద‌రు కొడుకులు కూడా ఇక్క‌డ నుంచే ఎమ్మెల్యేలు అయ్యారు. ఆ త‌ర్వాత కొడాలి నాని ఎంట్రీతో గుడివాడ‌ కొడాలి నాని కంచుకోటగా మారింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 1989లో మాత్రమే గుడివాడలో కాంగ్రెస్ గెలిచింది. ఆ త‌ర్వాత  జూనియర్ ఎన్టీఆర్ తో 2004 టిడిపి టికెట్ ద‌గ్గించుకున్న నాని తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
నాని.. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ తరుపున గెలిచారు. ఆ తర్వాత కొడాలి నాని వైసీపీలోకి వెళ్ళి వరుసగా 2014, 2019 ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు మంత్రిగా ఉండ‌డంతో నానికి తిరుగులేకుండా పోయింది. నాని టీడీపీ, చంద్ర‌బాబు.. లోకేష్‌ను టార్గెట్ గా చేసుకుని చేసే విమ‌ర్శ‌లు టీడీపీ వాళ్ల‌కు ఈటెల్లా గుచ్చుకుంటున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో నానిని ఎలాగైనా ఓడించాల‌ని ప‌ట్టుబ‌ట్టి మ‌రీ దేవినేని అవినాష్‌ను అక్క‌డ పోటీ చేయించ‌గా... అవినాష్ ఓడిపోయారు. ఇక ప్ర‌స్తుతం అక్క‌డ ఇన్‌చార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే రావి వెంక‌టేశ్వ‌ర‌రావును కంటిన్యూ చేస్తున్నారు.
అయితే రావికి నానిని ఢీ కొట్టే సీన్ లేదు . ఇప్ప‌టికే నానిపై రెండు సార్లు ఓడిపోయారు. ఈ క్ర‌మంలోనే నానికి చెక్ పెట్టేందుకు చంద్ర‌బాబు అక్క‌డ నంద‌మూరి బ్రాండ్‌ను తెర‌మీద‌కు తీసుకు వ‌స్తున్న‌ట్టు తెలుస్తోంది. నంద‌మూరి వార‌సులు అయిన నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ లేదా నంద‌మూరి చైత‌న్య కృష్ణ‌ పేర్లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. వీరిలో క‌ళ్యాణ్ రామ్ క‌న్నా కూడా చైత‌న్య కృష్ణ రాజ‌కీయాల్లో కాస్త యాక్టివ్‌గా ఉంటున్నారు. చంద్ర‌బాబు.. లోకేష్‌ను తిడుతోన్న నానికి కౌంట‌ర్లు ఇస్తున్నారు.
అటు ఏపీ ప్ర‌భుత్వంపై కూడా తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇక జిల్లా పార్టీలో కూడా కొంద‌రు నేతలు నంద‌మూరి బ్రాండ్‌తోనే నానికి చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని అంటున్నారు. మ‌రి బాబు నిర్ణ‌యం ఎలా ?  ఉంటుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: