కొడాలిని పీకేస్తున్నారా... కొత్త క‌మ్మ మంత్రి ఆయ‌నేనా ?

VUYYURU SUBHASH
జ‌గ‌న్ కేబినెట్లో మార్పులు, చేర్పులు వార్తలు మామూలుగా లేవు. మ‌రో మూడు నెల‌ల పాటు తెలుగు మెయిన్ మీడియాతో పాటు వెబ్ మీడియా వాళ్ల‌కు ఈ కేబినెట్ వార్త‌లు రాసుకునేందుకు చేతినిండా ప‌ని. ఎవ‌డికి తోచిన వార్త వాళ్లు రాసేసుకుంటారు. ఎవ‌రికి తోచిన అంచ‌నాలు వాళ్ల‌కు ఉంటాయి. ఈ లెక్క‌లు ఎలా ?  ఉన్నా అంతిమంగా జ‌గ‌న్ లెక్క‌లు జ‌గ‌న్‌కు ఉంటాయి. జ‌గ‌న్ ఈక్వేష‌న్లు వేరేగా ఉంటాయ్ ?  త‌న తండ్రి వైఎస్సార్ లా మాట ఇస్తే జ‌గ‌న్ మ‌డ‌మ తిప్ప‌డ‌న్న‌ది తెలిసిందే. ఈ మాటే ఇప్పుడు కొంద‌రు నేత‌ల‌కు మంత్రి ప‌ద‌విని క‌ట్ట‌బెట్టేలా చేస్తోందంటున్నారు. క‌మ్మ సామాజిక వ‌ర్గాన్ని జ‌గ‌న్ టార్గెట్ చేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు ఆ వ‌ర్గంతో పాటు టీడీపీలో ఉన్న ఈ వ‌ర్గం నేత‌ల్లో ఉన్నాయి.

ఈ అంశంపై వస్తోన్న విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో జ‌గ‌న్ సైతం ఈ వ‌ర్గం నేత‌ల్లో పార్టీకి న‌మ్మ‌కంగా ఉన్న వారికి ప్ర‌యార్టీ ఇచ్చే యోచ‌న‌లో ఉన్నారు. వాస్త‌వంగా చూస్తే జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల్లో 10 మంది క‌మ్మ నేత‌ల‌కు ఎమ్మెల్యే సీట్లు ఇస్తే వారిలో ఆరుగురు గెలిచి... న‌లుగురు ఓడిపోయారు. ఇక ముగ్గురు కమ్మ‌ల‌కు ఎంపీ టిక్కెట్లు ఇస్తే ఇద్ద‌రు గెల‌వ‌గా.. విజ‌య‌వాడలో పీవీపీ ఓడిపోయారు. ఇక చిల‌క‌లూరిపేట‌లో సీటు త్యాగం చేసిన సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు ఎమ్మెల్సీ ఇవ్వ‌డంతో పాటు మంత్రి ప‌ద‌వి ఇచ్చి కేబినెట్లో త‌న ప‌క్క‌న కూర్చో పెట్టుకుంటాన‌ని జ‌గ‌న్ చెప్పారు.

మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ క‌మ్మ వ‌ర్గం నేత‌.. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాలంటే కొడాలి నాని ప‌ద‌విపై వేటు క‌త్తి వేలాడుతోంది. కొడాలి చంద్ర‌బాబు, లోకేష్‌ను ఎన్ని బూతులు తిట్టినా ఆయ‌న్ను కేబినెట్లో ఉంచాలా ?  లేదా ? అన్న‌ది అంతిమంగా జ‌గ‌న్ ఇష్ట‌మే. ఇద్ద‌రు క‌మ్మ‌లకు చోటు ఉంటుందంటే నాని, రాజ‌శేఖ‌ర్ ఇద్ద‌రూ ఉంటారు. లేదా తాను ఇచ్చిన మాట కోసం క‌ట్టుబ‌డడంతో పాటు ఒక్క క‌మ్మే మంత్రిగా ఉండాలంటే ఖ‌చ్చితంగా కొడాలి ప‌ద‌విని పీకేస్తార‌న‌డంలో డౌటే లేదు. అప్పుడు క‌మ్మ వ‌ర్గం మంత్రిగా రాజ‌శేఖ‌ర్ మాత్ర‌మే ఉంటారు. ఇక త్వ‌ర‌లో జ‌రిగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ లేదా స్థానిక సంస్థ‌ల కోటా నుంచి రాజ‌శేఖ‌ర్‌ను మండ‌లికి ఎంపిక చేయ‌నున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: