హైదరాబాద్ లో భూములు కొనాలనుకునే వారికి బ్రహ్మాండమైన గుడ్ న్యూస్...?

Chakravarthi Kalyan

హైదరాబాద్ లో సొంత స్థలం ఉండాలని చాలా మంది కోరుకుంటారు. మరికొందరు పెట్టుబడి కోసం హైదరాబాద్ లో స్థలాలు కొంటారు. అయితే ఇలా స్థలం కొనేటప్పుడు అనేక చిక్కులు ఎదురవుతాయి. తీరా స్థలం కొన్నాక దానికి లే అవుట్ అనుమతి ఉందో లేదో తెలియదు.. ఏమైనా చిక్కులు ఉన్నాయో లేదో తెలియదు. 

 


ఇలాంటి వారి కోసం ఇప్పుడు హెచ్‌ఎండీఏ ఓ కొత్త సౌకర్యం తీసుకొచ్చింది.  మీరు ఒక్క సందేశం కానీ మెయిల్‌ కానీ చేస్తే, పూర్తి వివరాలు మీకు అందుతాయి. అందుకు హెచ్‌ఎండీఏ ఏర్పాట్లు చేసింది. advisory@hmda.gov.in అనే మెయిల్ కు కానీ.. 73311 85149 అనే మొబైల్ నంబర్‌కు కానీ మీరు సందేశం పంపాల్సి  ఉంటుంది. అలా పంపగానే.. హెచ్‌ఎండీఏ పరిధిలో ఎక్కడెక్కడ అక్రమ లేఅవుట్లు ఉన్నాయనే సమాచారం మీకు అందుతుంది. 

 

దీన్ని బట్టి మీరు కొనే స్థలం ఆ జాబితాలో ఉందో లేదో చూసుకుని నిర్ణయం తీసుకోవచ్చు. చాలా మంది రియల్‌ ఎస్టేట్ వ్యాపారులు..  హెచ్‌ఎండీఏ మార్గదర్శకాల ప్రకారం చేశామంటూ ప్లాట్లను విక్రయిస్తున్నారు. తీరా కొన్నవారు ఇళ్ల నిర్మాణానికి అనుమతులు, బ్యాంకు రుణాలు కోసం వెళ్లినప్పుడు  అనుమతలు రాక ఇబ్బంది పడుతున్నారు. అందుకే హెచ్ ఎండీఏ ఈ సౌకర్యం ఏర్పాటు చేసింది. 

 

అందుకే హైదరాబాద్ లో ఇళ్ల స్థలం కొనేవారు..  హెచ్‌ఎండీఏ ఎల్‌ పీ సంఖ్య ను తెలుసుకోవాలి. అలాగే లే అవుట్‌ రెరా రిజిస్ట్రేషన్‌ నంబరు కనుక్కోవాలి. హెచ్‌ఎండీఏ అనుమతి పొందిన తర్వాత రెరా చట్టం 2016 సెక్షన్‌ 5 కింద టీఎస్‌ రెరాలో రిజిస్టర్‌ చేయించాలి. నిబంధనల ప్రకారం ఖాళీ స్థలం, పచ్చదనం, వీధి దీపాలు, అప్రోచ్‌ రోడ్డు, తాగునీటి సరఫరా వ్యవస్థ, మురుగు నీటి వ్యవస్థ తదితర సౌకర్యాలు ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: