క‌రోనా విష‌యంలో పెద్ద గుడ్ ‌న్యూస్ ఇది...కానీ ఒక్క ష‌ర‌తు

Pradhyumna

క‌రోనా మహమ్మారితో ప్రపంచ మొత్తం అతలాకుత‌లం అవుతోంది. ఇలాంటి త‌రుణంలో, అంద‌రి చూపు వ్యాక్సిన్‌పైనే ప‌డుతోంది. ఈ క్రమంలో ప్ర‌ధానంగా అమెరికా, రష్యా, ఇండియా, యూర‌పియ‌న్ యూనియ‌న్‌లోని పలు దేశాలు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. ప్రస్తుతం అవి మొదటి దశను పూర్తి చేసుకొని రెండో దశ హ్యుమన్‌ ట్రయల్స్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో లండన్‌ ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం శుభవార్త చెప్పింది. యూనివర్సిటీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ మానవులపై ప్రయోగించగా ప్రోత్సాహక ఫలితాలు కనిపించాయని, ‘సురక్షితమైన, ఇమ్యూనోజెనిక్’లా ఉందని ‘ది లాన్సేట్’ అధ్యయనం తెలిపింది. ఇదే స‌మ‌యంలో మ‌రో గుడ్ న్యూస్ తెర‌మీద‌కు వ‌చ్చింది. స్వీడన్‌ కంపెనీ ఎంజమైటికా తయారు చేసిన కోల్డ్‌జైమ్‌ మందు కరోనా వైరస్‌ను మెరుగ్గా నియంత్రిస్తున్నట్లు ప్రాథమిక పరిశోధనల ద్వారా స్పష్టమైంది. వైరస్‌ సోకిన తరువాత కొంతకాలం నోరు, గొంతులోనే ఉండే వైరస్‌ను కోల్డ్‌జైమ్‌ 98.3 శా తం వరకు నిర్వీర్యం చేస్తున్నట్లు కంపెనీ గుర్తించింది.

 

అమెరికన్‌ కంపెనీ మైక్రోబాక్‌ లేబొరేటరీస్‌లో తాము పరిశోధనలు నిర్వహించామని ఎంజమైటికా తెలిపింది. కరోనా కారక వైరస్‌ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించే ముందు నోరు, గొంతులోనే కొంతకాలం వృద్ధి చెందుతుంటుంది. ఆ సమయంలోనే కోల్డ్‌జైమ్‌ వంటి మందులను వాడటం ద్వారా వైరస్‌ను నిరోధించవచ్చని కంపెనీ తెలిపింది. కోల్డ్‌జైమ్‌ను ఒక యంత్రం సాయంతో నోట్లోకి పిచికారి చేసుకోవాల్సి ఉంటుందని, తాము జరిపిన పరిశోధనల్లో కోల్డ్‌జైమ్‌ 20 నిమిషాల్లోనే వైరస్‌ను 98.3% వరకు నిర్వీర్యం చే దని, దుష్ప్రభావాలేవీ కనిపించలేదని కంపెనీ తెలిపింది.

 

అయితే, దీనికి సంబంధించిన మ‌రో సాంకేతిక స‌మ‌స్య‌ను సంస్థ వెల్ల‌డించింది. ప్ర‌స్తుత‌ ఫలితాల సాయంతో నేరుగా మందును మానవులపై ప్రయోగించే వీలులేద‌ని తెలిపింది. అయితే, మరిన్ని పరిశోధనలు చేసేందుకు మార్గం సుగమమవుతుందని కంపెనీ తెలిపింది. కోల్డ్‌జైమ్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కారక వైరస్‌తోపాటు సాధారణ జలుబుకు కారణమైన ‘హెచ్‌కోవడ్‌–229ఈ’ వైరస్‌పై కూడా ఇదే రకమైన ప్రభావం చూపుతున్నట్లు గతంలో జరిగిన పరిశోధనలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: