హఠాత్తుగా రేపు మళ్ళీ ఢిల్లీకి జగన్..?

Satya
ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్ళి వచ్చి వారం రోజులు కూడా కాలేదు. మళ్ళీ రేపు   ఢిల్లీకి వెళ్తారని  వార్తలు వస్తున్నాయి. ఈసారి ఢిల్లీ  టూర్ రెండు రోజుల పాటు సాగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సందర్భంగా జగన్ ప్రధాని మోడీతో మరోసారి సమావేశం కావాలనుకుంటున్నారుట. అంటే వారం రోజుల తేడాలో ఇది రెండవసారి. ఏ బీజేపీ ముఖ్యమంత్రి కూడా ఇంత తక్కువ సమయంలో ప్రధానిని రెండు సార్లు కలసిన దాఖలాలు లేవు. 


మరి జగన్ ఎందుకు ప్రధానితో భేటీ కోరుకుంటున్నారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. అయితే జగన్ ఈ నెల 5న ఢిల్లీ వెళ్ళినపుడు ఏపీలో గత చంద్రబాబు సర్కార్ చేసిన అవినీతికి సంబంధించి  కొన్ని ఆధారాలు ఇచ్చాని అంటున్నారు. వాటిని కొనసాగింపుంగా మరిన్ని ఆధారాలతో ఈసారి జగన్ ఢిల్లీ టూర్ ఉంటుందని అంటున్నారు.


అంతే కాదు, విద్యుత్ ఒప్పందాల‌ విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, అందువల్ల సమీక్ష చేసేందుకు అనుమంతించాలని జగన్ కోరుతున్నారు. అదే విధంగా పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల 800 కోట్లకు పైగా ఆదా అయిందని కూడా జగన్ చెబుతున్నారు. ఆ వివరాలకు కూడా ప్రధానికి, జలవనరుల శాఖా మంత్రి షెకావత్ కి ఇవ్వడం ద్వారా పోలవరంలో ఫ్రీ గా ముందుకు వెళేలా చూసుకోవాలనుకుంటున్నారు.


నవంబర్ 1న పోలవరం పనులు తిరిగి మొదలుపెడుతున్నారు. దానికి షెకావత్ ని ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాని కూడా జగన్ ఈ దఫా టూర్లో కలుస్తారని అంటున్నారు. ఆయనకు ఏపీలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా వివరించడం ద్వారా తన వ్యూహాలను అమలు చేయనున్నాని సమాచారం. అదే విధంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ని కలసి ఏపీకి నిధులు ఇవ్వాలని కోరుతారని అంటున్నారు. మొత్తానికి జగన్ ఢిల్లీ టూర్ ఆసక్తిని కలిగిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: