న్యాయస్థానాల తీర్పుల్లో ప్రజలకు "న్యాయం కనిపించాలి"

జయలలిత ఆదాయాన్ని మించిన ఆస్తులకేసు తీర్పులో సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానాలు చూస్తే మన భారతీయులు ఎందుకిలా తయారౌతున్నారో అర్ధంకాదు?  భారత సంస్కృతి అతి పురాతనమైనది. విశ్వాని కే నాగరికత నేర్పిన ఈ భారత  జాతి ఇంత నిస్తేజమవ్వటం ప్రపంచం ముందు ధారుణంగా హీనంగా చూడబడ టానికి కారణం పరిశీలిద్ధాం.


జయలలిత అక్రమాస్తుల కేసులో సంచలన తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం లోని జస్టీస్ అమితావ్ రాయ్ తీర్పు సమయంలో అత్యంత కీలక వ్యాఖ్యలు ఈ సమాజంపై చేశారు. శశికళ బృందాన్ని దోషులుగా నిర్ధారిస్తూ ప్రత్యేకంగా రాసిన ఏడు పేజీల తీర్పును చదువుతూ, అవినీతి  అంటురోగంలా జనజీవ నం లో ప్రతి చోటా శరవేగంగా వ్యాపిస్తుందని.




"ప్రజల్లో శిక్ష పడుతుందనే భయం కూడా లేని లెక్కలేనితనం, తెంపరితనం విపరీతంగా పెరిగిపోతోందని, లాభదాయక ప్రతిఫలాలను ఆశిస్తూ, సామాజిక భాధ్యతలను లక్ష్యపెట్టని  అసామాజిక భావజాలంపై పట్టు సాధిస్తున్నారు. రోజురోజుకూ పెరిగిపోతున్న, ఊపిరాడనివ్వకుండా ప్రాణాలు తీస్తున్న ఈ బహిరంగ అవినీతిని ప్రజా బాహుళ్యం నుంచి తరిమి కొట్టేందుకు అన్ని దశల్లో వ్యక్తి గతంగా, సమిష్టిగా జోక్యం చేసుకోవటం అని వార్యం" అని జస్టిస్‌ అమితావ్ రాయ్‌ వ్యాఖ్యానించారు.


"అక్రమ మార్గాల ద్వారా సంపద పోగేసుకోవాలనుకునే దురాశాపరులు రాజ్యాంగానికి వెన్నుపోటు పొడుస్తు న్నారు. సమాజంలో చెలరేగిపోతున్న అవినీతి ఆందోళన కలిగిస్తోంది" అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాయ్‌ తన ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతిపరుల్లో అపరాధ భావం కూడా కనిపించడంలేదని, శిక్ష పడుతుం దనే భయం కానరావటం లేదని తెలిపారు. సమాజంలో ఇలాంటివారిదే పైచేయి అవుతుండటంతో నిజాయితీ పరులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నరని వ్యాఖ్యానించారు.


ఈ విషయాన్ని తీసుకొని పరిశీలిస్తే, జయలలిత ఎలాగు దివంగతులయ్యారు. బ్రతికున్న శశికళలో ఈ తీర్పు వల్ల వచ్చే మార్పే మీ కనిపించలేదు. తను ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించలేక పోతున్నందుకు ఏడ్చింది కాని ఆమె లో అవమాన భారంగాని, అపరాధభావం కాని,  పరివర్తన ఆలోచనగాని కలికానికి కూడా కనిపించలేదు. వాటి స్థానములో తనకు అడ్దువచ్చా డని పనీర్ సెల్వంపై ఆగ్రహావేశాలు బహిరంగంగానే వ్యక్తం చేసింది. ఇంత దురాశా పూరిత  స్వభావి అనారోగ్యంతో అంతిమ దశలో ఉన్న జయలలితతో ఎలా ప్రవర్తించి ఉంటుందో? మనం ఊహించవచ్చు.




శశికళకు సుప్రీం కోర్టు జైలు శిక్ష ఖరారు చేసింది. ఆమె గడువు కావాలన్న అభ్యర్థనను కూడా సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. దీంతో చేసేదేమీ లేక శశికళ పోయెస్ గార్డెన్ నుంచి బెంగళూరుకు బయల్దేరారు. మార్గ మధ్యం లో ఆమె జయలలిత సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు. ఆ సమయంలో శశికళ తీవ్ర ఉద్వేగానికి లోన య్యారు. తనలోని ఆవేదనను, అసహనాన్ని బాహాటంగా చాటి చెప్పారు. జయలలిత సమాధిపై చేత్తో మూడు సార్లు కొడుతూ శపథం చేశారు. ఆమె ఆ సమయంలో ఏదో మాట్లా డారు. బహుశ జయలలిత తనను రాజకీయ వారసురాలిని చేయలేదనేమో?  ఆమె ఏం మాట్లాడారనే విషయంపై స్పష్టత లేదు.


తనకు ఈ స్థితి రావడంపై ఆవేదనతో పాటు తాను ఎక్కడున్నా అన్నాడీఎంకేను కాపాడుతానంటూ శశికళ ప్రతిన పూనినట్టు తెలుస్తోంది. శశికళ మునుపెన్నడూ ఇంత వింతగా ప్రవర్తించ లేదు. ఆమె ప్రవర్తన చూసి పక్కన ఉన్న ఆమె అనుచరులు నినాదాలు చేశారు. ఆమె శపథం చేసే సమయంలో ముఖమంతా రౌద్రంగా మారి పోయింది. ఆమె ఎవరిపై తన కోపాన్ని వెల్లగక్కారో తెలియలేదు. పన్నీర్‌ చేతుల్లోకి పార్టీ వెళుతుందన్న బాధతో, తన కుటుంబ సభ్యుల నుంచి పార్టీ చేజారిపోతుందన్న ఆందోళనతో ఆమె ఇలా ప్రవర్తించి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా శశికళ ప్రవర్తించిన తీరు అందరినీ నివ్వెరపోయేలా చేసింది.


జయలలిత మరణం తర్వాత నుంచి జరుగుతున్న పరిణామాలు, ముఖ్యమంత్రి పదవి నుంచి పన్నీర్ సెల్వాన్ని దించే యడం, ఆ తర్వాత ఆయన మళ్లీ తిరుగుబాటు చేయడం లాంటి పరిస్థితుల తర్వాత చూస్తే జనాగ్రహం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా సోషల్ మీడియాలో ఇప్పటివరకు ఎవరికీ అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ కామెంట్లు చేయని వర్గాల నుంచి కూడా శశికళ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టింగులు, ట్వీట్లు  రావడం చూశాం. ఇప్పుడు అన్నాడీఎంకేలో వ్యవస్థాపక సభ్యులు, నాయకులుగా ఉన్నవాళ్ల దగ్గర నుంచి సామాన్యుల వరకు చాలామంది అదే చెబుతున్నారు. దాదాపు శశికళ కేసులో ప్రజల భావననే  ద్విసభ్య ధర్మాసనం విడివిడిగా వ్యక్తం చేసింది.  


జయలలిత అనారోగ్యం పాలు కావడానికి ప్రధాన కారణం కూడా శశికళేనని, పైగా దాదాపు 75 రోజుల పాటు అమ్మ ఆస్పత్రిలో ఉన్నా, ఏ ఒక్కరికీ ఆమెను చూసే అవకాశం కల్పించకుండా రహస్యంగా ఉంచింది కూడా శశికళే నని అంటున్నారు. జాతీయ స్థాయి నాయకుల నుంచి రాష్ట్రంలో మంత్రుల వరకు ప్రతి ఒక్కరూ ఆస్పత్రికి అయితే వెళ్లారు గానీ, కేవలం అక్కడి వైద్యులతో మాట్లాడి వచ్చేయాల్సి వచ్చింది తప్ప అమ్మను మాత్రం చూడలేకపోయారు. దీనికి కారణం శశికళ విధించిన ఆంక్షలేనని పలు వురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


నిజంగా అమ్మకు ఇన్ఫెక్షన్ వస్తుందని వైద్యులకు అనుమానం ఉంటే, శశికళను మాత్రం అప్పట్లో ఆమె మంచం పక్కనే ఎందుకు ఉండనిచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఫిజియోథెరపీ చేయడానికినర్సులు లేదా వైద్యులు జయలలితను ముట్టుకుంటే ఎక్కడ వాళ్ల నుంచి ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుందోనని రోబోల ను కూడా నియమించినప్పుడు, శశికళను మాత్రం అసలు ఎలా అనుమతించారని అడుగుతున్నారు.




ఇప్పుడు కూడా శశికళ, మెరీనా బీచ్‌లోని జయలలిత సమాధి మీద మూడుసార్లు చేత్తోకొట్టి ఏదోశపథం చేస్తున్నట్లుగా చేశారని, అమ్మ సమాధి వద్ద కావాలంటే నమ స్కారం చేసుకోవచ్చు గానీ అలా కొట్టడం యేమిటని అడుగుతున్నారు. 


“ధర్మం దారి తప్పింది. న్యాయం నిశీధిలో కలిసిపోయింది. చట్టాలు చట్టుబండలయాయి. కొన్నిసార్లు నేరస్తులకు చట్టాలు చుట్టాలే ఔతున్నాయి”  ఉదాహరణకు కర్ణాటక హైకోర్ట్ జయలలిత శశికళ మరో యిద్ధరిని నిర్ధోషులుగా ఇచ్చిన తీర్పే నేటి శశికళ తమిళనాట సృష్ఠించిన దౌష్ట్య ఖాండకు కారణం. ప్రజలంతా ఆ తీర్పు వచ్చినప్పుడు ఈ మాత్రానికి 18 సంవత్సరాలు జయలలితపై విచారణ దేనికని బహిరంగంగానే ప్రశ్నించారు.


అలాగే కర్ణాటక ప్రత్యేక న్యాయస్థానం (ట్రయల్ కోర్ట్) తీర్పు ఇచ్చినప్పుడు ఇప్పుడు సుప్రీం కోర్ట్ ద్విసభ్య ధర్మాసనం తీర్పును అభినందించినట్లే అభినందించారు. సాధారణంగా ప్రజలు ఎన్నికల్లో నాయకులను ఎన్నుకుంటారు. ఆ తరవాత రాజ్యాంగ వ్యవస్థలు వారిపై నియంత్రణ కొనసాగించా ల్సిన అవసరముంది. అలాంటి రాజ్యాంగ వ్యవస్థల్లోకి శశికళ లాంటి వాళ్ళ ప్రవేశాన్ని నిరోధించా ల్సిన బాధ్యత శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలది. వీటి మద్య సహకారం కూడా అవసరం. ఉదాహరణకు చెన్నై కమీషనర్ ఆఫ్ పోలీస్ జార్జ్ పూర్తిగా శశికళ లాంటి నేరస్తురాలికి సహాయకుడుగా ఉన్నారని వార్తలొచ్చాయి. అతనిపై సత్వర విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోలేమా? అలా చేస్తే శాసనవ్యవస్థ ద్వారా ఎన్నికైన ఏ మంత్రో అడ్డుపడతాడని భయం. న్యాయస్థానం తీర్పివ్వగానే వందల సంఖ్యలో పోలీసులు శాసనసభ్యులున్న శశికళ కాంప్ పై దాడి చేయ గలిగారు. ఆపనే ముందు ఎందుకు చేయలేదు? ఇక వేళ శశికళ ముఖ్యమంత్రి అయితే ఏమౌతుందోనన్న పోలీసు వ్యవస్థ భయం.




గవర్నర్ గారు సరిగా వ్యవహరించబట్టి సరిపోయిందిగాని లెకుంటే తమిళనాడు మన్నార్ గుడి మాఫియా హస్తగతమయ్యేది. ఈ జయలలిత ఆదాయాన్ని మించిన ఆస్తుల కేసు ఒక రెండు దశాబ్ధాల ముందే వేసిన సుబ్రమణ్యస్వామి సైతం శశికళతో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యకపోతే గవర్నర్ పై కేసు పెడాతానని, అదీ ఇదని గోల చేస్తున్నారు. అసలిప్పుడైనా ఒక నేరగ్రస్థ నిలబెట్టిన పళని స్వామిని బలప్రదర్శనకు పిలవవలసిన అవసరం గవర్నర్కుందా? తాత్కాలిక కార్యదర్శి పదవే లేని పార్టీలో ఆమె ఆదేశాల నెంతవరకు పరిగణనలోకి తీసుకోవచ్చు?   ఇలాంటివన్నీ ప్రశ్నార్ధకాలే. ఇంకో అద్భుతం ఏమంటే సుప్రీం కోర్ట్ శశికళకు ఆరోగ్య రీత్యా ఆమె లొంగిపోవటానికి ఆమె కోరినట్లు నెలరోజులు గడువు తిరస్కరిస్తే ఈ నెలరోజుల్లో ఎన్ని జఠిలమైన సమస్యలు సృష్ఠించి ఉండేదో? మరో సారి కర్ణాటక హైకోర్ట్ తీర్పు వల్ల ఏర్పడిన దుస్థితి రాష్ట్రానికి దాపురించేది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: