తానా మహాసభాలకి 3 కోట్ల భారీ విరాళం...!!!

NCR

అమెరికా తెలుగు సంఘాలలో తానా కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ తాన సంస్థ నిర్వహించే ఎటువంటి కార్యక్రమానికైనా సరే అమెరికాలోని తెలుగు ప్రజల నుంచీ విశేషమైన ఆదరణ లభిస్తుంది. తానా సంస్థ సైతం అందుకు తగ్గట్టుగానే భారీ స్థాయిలో కార్యక్రమాల్ని నిర్వహిస్తూ, స్థానికంగా ఉండే తెలుగు ప్రజలకి తాము ఉన్నామనే భరోసా ఇస్తుంది. అయితే జులై నెల 4,5,6 తేదీల్లో నిర్వహించబోయే తానా 22 వ మహా సభలని భారీ స్థాయిలో నిర్వహించడం కోసం విరాళాలకై అమెరికాలో తెలుగు ప్రవాసులు ఉండే ప్రాంతాలకి తానా అధ్యక్షులు సతీష్ వేమన ఆయన బృందం ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే

 

తానా22వ మహాసభల నిర్వహణ కోసం నిధులు సేకరణకై డెట్రాయిట్‌లో ప్రవాసులు నిర్వహించిన కార్యకమానికి హాజరయ్యింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రవాసులు తానా ఊహించని రీతిలో దాదాపు 3 కోట్లు విరాళాలుగా ప్రకటించారు. ఈ నిధుల సేకరణ కార్యక్రమానికి తానా అధ్యక్షుడు సతీష్ మేమన హాజరయ్యారు.

 

సభావేదికపై డెట్రాయిట్ ప్రవాసుల తరుపున తానా ప్రాంతీయ ప్రతినిధి పంత్ర సునీల్  నేతృత్వంలో 3 కోట్ల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించారు. ఈ భారీ విరాళాన్ని ప్రకటించడంతో సతీష్ వేమన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సారి జరగబోయే తానా మహా సభలని ఊహించని రీతిలో జరుపుతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి తాన మాజీ అధ్యక్షుడు డా.బండ్ల హనుమయ్య తదితరులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: