"ప్రతిభ"...ఉంటేనే చోటు..ట్రంప్ స్పష్టం...!!!

NCR

అమెరికా వచ్చి స్థారపడాలని అనుకునే వారు ఎంతో మంది ప్రతిభ ఉంటేనే ఇక్కడ అడుగు పెట్టాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తేల్చి చెప్పారు. ఎటువంటి పరిస్తిత్తుల్లో ప్రతిభ లేని వారికి చోటు ఉండదని తెలిపారు. యూఎస్ కాంగ్రెస్ సభని ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్ మరిన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు.

 

వలసదారులని అడ్డుకోవడానికి గోడ నిర్మాణం సరైనదని అందుకు ఎవరు సహకరించిన లేకపోయినా సరే గోడ నిర్మాణం చేసి తీరాలని అన్నారు. తమ దేశానికి ఎవరు వచ్చినా సరే న్యాయపరంగానే అడుగు పెట్టాలని ట్రంప్ తెలిపారు. అక్రమ వలసదారులు దేశానికి పెను ముప్పుగా ఆయన పేర్కొన్నారు. అమెరికన్ల ఉద్యోగాలు, వారి భవిష్యత్తుకు రక్షణ కల్పిస్తూ వలస వ్యవస్థను రూపొందించడం మా నైతిక అన్నారు.

 

ఎంతో మంది విదేశీయులు మా దేశానికి రావాలి కాని అది చట్టబద్దంగా ఉండాలని అన్నారు. గోడ నిర్మాణం పై కూడా ట్రంప్ సభలో మాట్లాడుతూ డెమోక్రాట్లు గోడ నిర్మాణానికి సహకరించాలని ఇది అమెరికా దేశ భద్రతా విషయమని అన్నారు. విదేశీయులు ఇంకా ఎక్కువ మంది మా దేశానికి రావాలనే నేను కోరుకుంటున్నాను. కానీ న్యాయపరంగా రావాలని  అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: