“భారత్” కు అరుదైన “గౌరవం”..అమెరికా “ప్రకటన”

Bhavannarayana Nch

డాలర్ తో వివిధ దేశాల ద్రవ్య విలువలని నిర్ధారించే హోదా గల దేశాల జాబితాలో భారత్ కి కూడా స్థానం కల్పించడం ఎంతో గర్వించతగ్గ విషయం..ఇదే విషయాన్ని అమెరికా ప్రకటించింది..అయితే ఈ విషయంలో ఇప్పటికే భారత్ కంటే ముందుగానే ఐదు దేశాలు ఈ హోదాని కలిగిఉన్నాయని అమెరికా ట్రెజరీ సెక్రెటరీ స్టీవెన్ మ్యూనిచ్ తెలిపారు

 

అమెరికా ఈ గౌరవ గుర్తింపు ఇచ్చిన దేశాలు చైనా, జర్మనీ, జపాన్, దక్షిణకొరియా, స్విట్జర్లాండ్‌లు భారత్ తో పాటుగా ఉప్పుడు ఉన్నాయి..అయితే వివిధ దేశాల ద్రవ్య విలువలను నిర్ధారించేందుకు తమకు ఆరు దేశాల సహయం అవసరమయిందని స్టీవెన్  చెప్పారు. ఇప్పటికే అయిదు దేశాలు పరిశీలక హోదా కలిగి ఉన్నందు వల్ల ఆరో దేశంగా భారత్‌ను చేర్చామని స్టీవెన్ చెప్పారు.

 

అయితే తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో అమెరికా , భారత్ దౌత్య సంబంధాలను మరింత పటిష్ట పరిచే అవకాశం ఉందని స్టీవెన్ అభిప్రాయపడుతున్నారు. విదేశీ కరెన్సీతో డాలర్ విలువను నిర్ధారించే విషయంలో ఇతర దేశాలకు పరిశీలక హోదా కల్పించడం వల్ల వ్యాపార లావాదేవీల్లో పారదర్శకత ఎంతో స్పష్టం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: