భారత్ సత్తా చాటిన “ఎన్నారై బాలిక”

Bhavannarayana Nch

భారతీయులకి అపారమైన తెలివితేటలు ఉంటాయి అనే విషయం ప్రపంచ దేశాలు అన్నిటికీ తెలుసు అందుకే అమెరికా వంటి అగ్రరాజ్యాలు సైతం భారతీయుల తెలివితేటలతో తమ ఆర్ధికాభివృద్ధి ని పెంచుతున్నాయి...అందుకే అమెరికా వీసా పాలసీ లో కూడా మార్పులు చేయక పోవడానికి కారణం సగానికి సంగం మంది భారతీయ టేక్కీల కోసమే అనేది బహిరంగ వాస్తవం.

 

ఇదిలా ఉంటే మరో భారత తేజం..భారతీయ సంతతి కి చెందినా ఓ బాలిక ప్రపంచ స్తాయి గణిత పోటీలలో తన సత్తా చాటింది..న్యూదిల్లీలో జన్మించిన ఎనిమిదేళ్ల చిన్నారి సోహినిరాయ్ చౌదరి ప్రతిష్టాత్మక ''మ్యాథ్లెటిక్స్ హాల్ ఆఫ్ ఫేమ్‌''లోకి ప్రవేశించిన బాలికగా ఘనత సాధించింది...ఎంతో చిన్న వయసులో ఈ రికార్డు సృష్టించిన భారత సంతతి బాలికగా రికార్డుల కెక్కింది..ప్రైమరీ స్కూల్ విద్యార్థుల కోసం నిర్వహించిన గణిత ఆధారిత ఆన్‌లైన్ పోటీల్లో బర్మింగ్‌హమ్‌లోని నెల్సన్ ప్రైమరీ స్కూల్‌ తరఫున ఆమె పోటీల్లో పాల్గొంది.

 

ఈ పోటీలో ఇతర దేశాలకి చెందిన దాదాపు 100 మంది విద్యార్ధులుతో పోటీపడి.. ప్రతిష్టాత్మక ''మ్యాథ్లెటిక్స్ హాల్ ఆఫ్ ఫేమ్‌''లో చోటు సంపాందించింది. అత్యంత వేగంగా మ్యాథమెటికల్ పజిల్స్‌ను పూర్తి చేసి తన ప్రతిభని చాటుకుంది..తన కుమార్తె ఈ ఘనత సాధించినందుకు ఎన్నారై అయిన మైనక్ రాయ్ చౌదరి హర్షం వ్యక్తంచేశాడు...మన వాళ్ళు ఎక్కడున్నా సరే భారత్ పేరుని నిలబెట్టడంలో ముందు  ఉంటారు అని మరోమారు నిరూపించింది ఈ బాలిక..

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: