అలా చేస్తూ.. బ్రష్ మింగేసిన యువతి.. చివరికి?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా ఇట్టే తెలుసుకోగలుగుతున్నాడు మనిషి. అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లోనే ఇంట్లో కూర్చున్న దగ్గర నుంచి ప్రపంచాన్ని చుట్టేయగలుగుతున్నాడు. అయితే ఇక సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నో రకాల ఆసక్తికర ఘటనలు వెలుగులోకి వస్తుంటాయి. ఇలా వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు అందరిని ఆశ్చర్యానికి గురి చేసే కొన్ని విషయాలు కూడా ఉంటాయి అని చెప్పాలి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించె.

 సాధారణంగా ప్రతి మనిషి ఉదయాన్నే లేచిన తర్వాత బ్రష్ చేసుకుని తమ రోజుని ప్రారంభిస్తూ ఉంటారు. ఇక బ్రష్ చేయలేదు అంటే ఇక నోటి నుంచి దుర్వాసన రావడం కారణంగా ఎవరితోనూ సరిగా మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఏకంగా పళ్లు తోముకునే బ్రష్ కడుపులోకి వెళ్ళింది అంటే ఎవరైనా నమ్ముతారా.. ఊరుకోండి బాసూ అంత పెద్ద బ్రష్ కడుపులోకి ఎలా వెళ్తుంది. అయినా అలా ఎవరైనా బ్రష్ లోపలికి మింగేస్తారా అని అంటారు ఎవరైనా. కానీ ఇక్కడ మాత్రం ఇలాంటిదే జరిగింది.

 గొంతులో ఇరుక్కుపోయిన ఆహారాన్ని తొలగించడానికి ప్రయత్నించి ఒక మహిళ చివరికి టూత్ బ్రష్ మింగేసింది. ఈ ఘటన స్పెయిన్ లో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.  హైజీమా అనే 21 ఏళ్ల యువతి భోజనం చేస్తున్న సమయంలో గొంతులో ఆహారం ఇరుక్కుపోయింది. అయితే ఎంత ప్రయత్నించినా బయటకి రాకపోవడంతో.. టూత్ బ్రష్ సహాయంతో గొంతులో ఇరుక్కుపోయిన ఆహారాన్ని క్లీన్ చేసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు టూత్ బ్రష్ ఆమె కడుపులోకి వెళ్లిపోయింది. ఇక వెంటనే ఆమె ఆసుపత్రికి వెళ్ళగా దాదాపు.. 3:45 గంటలపాటు శ్రమించి వైద్యులు సర్జరీ చేసి ఆమె కడుపులో నుంచి బ్రష్ బయటకి తీశారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: