ఆ రెస్టారెంట్లో.. డబ్బులిచ్చి మరి సిబ్బందితో కొట్టించుకుంటున్న కస్టమర్లు?

praveen
సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఫుడ్ బోర్ కొట్టినప్పుడు దగ్గరలో ఉన్న రెస్టారెంట్ కు వెళ్లి  కావలసిన ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే కస్టమర్లను ఆకర్షించేందుకు ఆయా రెస్టారెంట్లు వినూత్నమైన ఆఫర్లను కూడా ప్రకటిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఒక రెస్టారెంట్ కు సంబంధించిన విషయం మాత్రం సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆ రెస్టారెంట్ కు వెళ్లిన ప్రతి కస్టమర్ చెంప చెల్లుమంటుంది. ఆగండి ఆగండి.. చెంప చెల్లుమనడం అంటే చెంప మీద కొడతారా  అనే డౌట్ వచ్చింది కదా.

 డౌట్ ఎందుకు అదే ఫిక్స్ అయిపోండి. నిజంగానే ఆ రెస్టారెంట్ కు వెళ్లిన కస్టమర్ల చెంపలు వాయిస్తారు అక్కడ సిబ్బంది. అదేంటి బాసు.. కస్టమర్లను దేవుళ్ళ లాగా చూసుకొని వాళ్లకు కావాల్సింది తెచ్చిపెట్టడం మానేసి.. ఇలా రెస్టారెంట్ కు వచ్చిన కస్టమర్ల చెంపలు వాయించడం ఏంటీ.. అలా చేస్తే ఎవరైనా వస్తారా అంటారా. అలా చేసినందుకే ఆ రెస్టారెంట్ కు కస్టమర్లు బారులు తీరుతూ ఉండడం గమనార్హం. ఇది వినడానికి కాస్త విచిత్రంగా ఆశ్చర్యకరంగా కూడా ఉంది కదా. కానీ జపాన్ లోని రెస్టారెంట్లో మాత్రం ఇదే జరుగుతుంది. ఏకంగా రెస్టారెంట్ కు వెళ్లిన కస్టమర్లు అందరూ కూడా అక్కడ సిబ్బందితో చెంప దెబ్బలు కొట్టించుకుంటున్నారు.

 జపాన్ లోని ఓ వింత థీమ్ ఉంది. నాగోయా లోని షాచి హోకో యా రెస్టారెంట్లో శాచి హోకో యా అనే ఫుడ్ ఐటమ్ వెరీ స్పెషల్. ఇక అక్కడికి వచ్చి కస్టమర్లకు ఈ ఫుడ్ తినడం అంటే ఎంతో ఇష్టం. అయితే ఇప్పుడు తినాలి అంటే కాస్త సాహసం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఫుడ్ ఐటమ్ తినే ముందు లేడీ వెయిటర్స్ తో చెంప దెబ్బలు కొట్టించుకుంటున్నారు కస్టమర్లు. లేడీస్ వైటర్స్ తో కొట్టించుకుంటే ఒక్క చెంప దెబ్బకు మూడువందల ఎన్ లు ఇస్తారు. ఇక కోరుకున్న సిబ్బందితో కొట్టించుకోవాలంటే 500 చెల్లించాలి. అంతేకాదు దీనికి సర్చార్జి కూడా ఉంటుంది. ఇలా ఏకంగా డబ్బులు ఇచ్చి మరి కస్టమర్లు కొట్టించుకుంటూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri

సంబంధిత వార్తలు: