భారత్‌, కెనడా.. అమెరికా మొగ్గు ఎటువైపు?

Chakravarthi Kalyan
ఫైవ్‌ ఐస్ అనే పేరుతో ఇంటిలిజెన్స్ సమాచారాలను ఒకరికొకరు ఇచ్చుకొనే టీంలో  అమెరికా అలాగే కెనడా భాగస్వామ్యులు. ఉక్రెయిన్ దేశానికి ఆయుధాలను కెనడా ఒక రకంగా  అమెరికా సలహాతోనే పంపిందని తెలుస్తుంది. తమకు ఇంత సహాయం చేస్తుంది కాబట్టి కెనడాని కూడా నాటో దేశాలు, యూరప్ దేశాలతో పాటు సమానంగానే చూడాలి అమెరికా. మరో పక్కన భారత్ తో కూడా అమెరికా స్నేహంగానే మెలుగుతుంది.

అమెరికాకు కనుక భారత్ ముఖ్యమా, కెనడా ముఖ్యమా అనే తులా భార పరిస్థితి వస్తే కనుక కెనడానే ఎక్కువ తూగుతుంది. భారత్ ను ముక్కలు చేస్తానన్నటువంటి  ఖలిస్తానీ ముఖ్య నాయకుడు  హర్దీప్ సింగ్ నిజ్జర్  కెనడాలో అనుమానాస్పద స్థితిలో చంపబడ్డాడు.  అంతకు ముందు గురుద్వారాలో తలదాచుకుని బయటికి వచ్చిన సమయంలో ఆయనను కాల్చి చంపారు కొందరు అనుమానాస్పద వ్యక్తులు.

అయితే ఇది భారత్  రీసెర్చ్ అనాలసిస్ వింగ్ పనే అని తేల్చి చెప్పారు కెనడా ప్రధాని. అయితే ఈ విషయంలో కెనడా మాటను అమెరికా కూడా సపోర్ట్ చేస్తుందని తెలుస్తుంది. అమెరికా ప్రమేయంతోనే నిజ్జర్ విషయంలో భారత్ రా డిపార్ట్మెంట్ పాత్ర ఉందని కెనడా నమ్ముతుందని తెలుస్తుంది. అయితే కెనడా ఈ కేసును ఇద్దరు దౌత్యవేత్తల మధ్య సంభాషణ ప్రకారమే నడిపించబోతుందని అర్థమైంది భారత్ కు.

దాంతో ఇద్దరు దౌత్యవేత్తల మధ్య సంభాషణను ఎలా ఆధారంగా తీసుకుంటారని భారత్ కెనడాను అడుగుతుంది ఇప్పుడు. అసలు భారతదేశం నుండి కెనడాకు వెళ్లి అక్కడ గురుద్వారాలో ఉన్న ఖలిస్తానీ నేత నిజ్జర్ ను భారత రా డిపార్ట్మెంట్ ఎందుకు హత్య చేస్తుంది అని అడుగుతుంది భారత్. ఒకవేళ భారతీయులు, భారత సంస్థ అక్కడ వెళ్లి హత్య చేయడం నిజమే అయితే వాళ్లు ఎలా చూస్తూ ఊరుకుంటారు  అని అడుగుతున్నారు చాలా మంది. భారత్ పై లేనిపోని   అబాండాలు వేయడం కరెక్ట్ కాదని భారత ప్రభుత్వం ఈ విషయంలో ఘాటుగా స్పందించిందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: