తెలంగాణ రాష్ట్రం లో ఎప్పటి నుండో ఎదురు చూసిన సర్పంచ్ ఎలక్షన్స్ ముగిసాయి.మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికల ను నిర్వహించారు ఎన్నికల అధికారులు. మొదటి విడత డిసెంబర్ 11 న ఎలక్షన్ జరగగా.. రెండో విడత డిసెంబర్ 14న పోలింగ్ జరిగింది.. ఇక మూడో విడత డిసెంబర్ 17 న జరిగింది. ఇక తెలంగాణ లో 12,733 సర్పంచ్ స్థానాలకి గానూ 7,010 స్థానాలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 3,502 స్థానాలు గెలుచుకోగా.. బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 688 స్థానాలు గెలుచుకున్నారు. అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా చాలానే సీట్లు గెలుచుకున్నారు....
అలా తెలంగాణ లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంత వాతావరణం లో ముగిశాయి. అక్కడక్కడ కొన్ని అల్లర్లు జరిగినప్పటికీ ప్రస్తుతం ఎలక్షన్స్ సక్సెస్ఫుల్గా ముగించేశారు. అయితే తాజాగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ తెలంగాణ లో గెలిచిన సర్పంచ్ లకు, వార్డు అభ్యర్థుల కు ఓ షాకింగ్ విషయాన్ని ఆదేశించింది.. అదేంటంటే.. పంచాయతీ ఎలక్షన్స్ లో పోటీ చేసి గెలిచిన సర్పంచ్, వార్డ్ అభ్యర్థులంతా 45 రోజుల్లోగా ఖర్చుల నివేదికల ను ఎంపీడీవో లకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.. ఖర్చు నివేదికలు 45 రోజుల్లోగా అందజేయకుంటే చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని స్టేట్ ఎలక్షన్ కమిషన్ హెచ్చరించింది.
అంతే కాకుండా గెలిచిన అభ్యర్థులు ఖర్చు నివేదికలు ఎంపీడీవో కి 45 రోజులలోపు సమర్పించకపోతే ఆ అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తామని స్పష్టం చేసింది. అంతే కాకుండా బరి లో నిలిచిన వారు వివరాలు ఇవ్వకపోతే మూడేళ్ల వరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు అవకాశం ఉండదని స్టేట్ ఎలక్షన్ కమిషన్ హెచ్చరించింది. మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ హెచ్చరించినట్టు సర్పంచ్ లు, వార్డు అభ్యర్థులు నడుచుకుంటారా లేదా అనేది చూడాలి.