దర్శకుడు ప్రశాంత్ వర్మ హను-మాన్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈయన చేసే సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే రాబోతున్నాయి. ఇప్పటికే హను-మాన్ మూవీకి సీక్వెల్ గా జై హనుమాన్ మూవీ తో పాటు పలు ప్రాజెక్టులు కూడా ఆయన చేతిలో ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా బాలకృష్ణ ప్రశాంత్ వర్మపై కేసు వేయబోతున్నాడు అంటూ ఓ వార్త సినీ వర్గాల్లో వినిపిస్తోంది.దానికి ప్రధాన కారణం మోక్షజ్ఞతో ఫస్ట్ మూవీ చేస్తానని ప్రశాంత్ వర్మ బాలకృష్ణకి మాట ఇవ్వడమే. అయితే ప్రశాంత్ వర్మ మొదట బాలకృష్ణ హోస్ట్ గా చేసిన అన్ స్టాపబుల్ షోకి డైరెక్షన్ చేశారు.ఆ సమయంలో ప్రశాంత్ వర్మ పనితనం మెచ్చిన బాలకృష్ణ తన కొడుకు మొదటి మూవీకి దర్శకత్వం చేసే బాధ్యతలను ఆయనకే అప్పగించారు.
అలా ప్రశాంత్ వర్మ కూడా మోక్షజ్ఞని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారనే వార్తలు వినిపించాయి. అలాగే ఈ సినిమాకి సంబంధించిన మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రివీల్ చేశారు.కానీ సడన్గా ఏమైందో ఏమో కానీ మోక్షజ్ఞ మొదటి మూవీని ప్రశాంత్ వర్మ పట్టాలెక్కించడం లేదు. మోక్షజ్ఞ సినిమాని పక్కన పెట్టి ఆయనకు సంబంధించిన ఇతర సినిమాలు చూసుకుంటున్నారు. దాంతో బాలకృష్ణ ఇప్పటికే పలు మార్లు ప్రశాంత్ వర్మ కి చెప్పి చూశారట. కానీ ప్రశాంత్ వర్మ ఎలాంటి ఉలుకు పలుకు లేకుండా వేరే సినిమాలకు వర్క్ చేయడంతో కోపంతో ఊగిపోయిన బాలకృష్ణ తన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చారట.
అయినా కూడా ప్రశాంత్ వర్మ తీరులో మార్పు రాకపోవడంతో చివరికి ప్రశాంత్ వర్మపై బాలకృష్ణ కేసు పెట్టబోతున్నట్టు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.అయితే మోక్షజ్ఞ సినిమా కోసం బాలకృష్ణ దగ్గర ఇప్పటికే ప్రశాంత్ వర్మ 25 కోట్ల రెమ్యూనరేషన్ కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. డబ్బులు తీసుకొని మోక్షజ్ఞ సినిమాని పట్టించుకోకుండా వేరే సినిమాల కోసం ప్రశాంత్ వర్మ వర్క్ చేయడంతో బాలకృష్ణ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని పోలీస్ కేసు పెట్టబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే బాలకృష్ణ ప్రశాంత్ వర్మపై కేసు పెట్టబోతున్నారా..లేక ఇది సోషల్ మీడియాలో వచ్చే రూమరేనా అనేది తెలియాల్సి ఉంది