జిన్ మూవీ రివ్యూ & రేటింగ్!
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్ పై నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన జిన్ మూవీ నేడు థియేటర్లలో విడుదలైంది. అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాద్, రవి భట్, సంగీత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాపై విడుదలకు ముందే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. చిన్మయ్ రామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా నవ్విస్తూ భయపెట్టిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.
కథ :
ఒక కాలేజ్ లోని లైబ్రరీలో సమయంలో వింత శబ్దాలు వస్తూ ఉంటాయి. రాత్రిపూట ఆ భవనంలో చదువుకునే ఒక కుర్రాడికి ఈ వింత అనుభవం ఎదురవుతుంది. నలుగురు కుర్రాళ్ళు పరీక్ష రాయడానికి భూతనాల చెరువు దాటి అదే కాలేజ్ కు వెళ్లగా ఆ కుర్రాళ్లకు అక్కడ ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఆ భవనంలో నలుగురు కుర్రాళ్ళు బంధించబడటానికి కారణాలేంటి? ఈ క్రమంలో జిన్ ఏం చేస్తుంది? జిన్ వల్ల ఎదురైన ఏ సమస్యలు ఏ విధంగా గట్టెక్కాయి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
విశ్లేషణ :
జిన్ సినిమాలో ఫస్టాఫ్ అంతా నలుగురు కుర్రాళ్ళ అల్లరి చేష్టలతో జోవియల్ గా సాగుతుంది. ఊహించని ట్విస్ట్ తో ఇంటర్వెల్ ముగుస్తుంది. అయితే ఎంత కష్టపడినా వాళ్ళు ఆ భవనం నుండి బయటకు రాలేకపోతారు. హర్రర్ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకుంది. ప్రేక్షకులను మెప్పించేలా ఈ సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు.
సెకండాఫ్ లో జిన్ ఎంట్రీ, ఆ కాలేజ్ హిస్టరీ పోలీసుల ఎంట్రీతో కథ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆత్మలకు సంబంధించిన ప్రతి ట్విస్ట్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉందని హింట్ ఇస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమాను ముగించడం కొసమెరుపు.
సినిమాలో అమిత్ రావ్ నటన అదరగొట్టింది. సెకండాఫ్ లో అమిత్ రావ్ ఎంట్రీ అదిరిపోయింది. కంటి చూపుతో అమిత్ రావు ఇచ్చిన ఎక్స్ ప్రెషన్లు బాగున్నాయి. పర్వేజ్ సింబ నటన సినిమాకు హైలెట్ అయింది. సినిమాలోని ప్రతి పాత్ర ప్రేక్షకులను మెప్పించేలా ఉంది.
టెక్నీకల్ గా కూడా ఈ సినిమా స్ట్రాంగ్ గా ఉంది. అలెక్స్ ఆర్ఆర్, సునీల్ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలెట్ అయ్యాయి. హర్రర్ థ్రిల్లర్ కామెడీ సినిమాలను ఇష్టపడే వాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. నిర్మాతలు ఈ సినిమా ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడలేదని అర్థమవుతోంది.
రేటింగ్ : 3.0/5.0