ఫోన్ రావడంతో పాము పెట్టేందుకు వెళ్లిన వ్యక్తి.. కానీ అక్కడ ఉంది చూసి షాక్?

praveen
ఇటీవల కాలంలో పాములు పట్టడం కూడా ఒక వృత్తిగా మారిపోయింది అనే విషయం తెలిసిందే. పాములు పట్టడంలో ప్రత్యేకమైన శిక్షణ తీసుకొని  ఇలా కూడా భారీగా డబ్బులు సంపాదిస్తున్నారు ఎంతోమంది. అంతే కాదు ఇలా ఇంట్లోకి చొరబడిన పాములను ఎంతో చాకచక్యంగా పట్టుకుంటూ ఆ వీడియోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ అలా కూడా డబ్బులు సంపాదిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ఒక వ్యక్తికి పాము దూరింది పట్టుకోవాలి అంటు ఫోన్ వచ్చింది. దీంతో హడావిడిగా అతను బయలుదేరాడు. కానీ అక్కడికి వెళ్లి చూసిన తర్వాత మాత్రం ఒక్కసారిగా అవాక్కయ్యాడు.

 ఈ ఘటన ఆస్ట్రేలియాలో వెలుగులోకి వచ్చింది. క్వీన్స్ లాండ్ లోని సన్ షైన్  కోస్ట్ లో నూసా స్నేక్ క్యాచర్ సెంటర్ వుంది. ఈ క్రమంలోనే సమీప ప్రాంతాల్లో ఎప్పుడు ఏ ఇంట్లోకి పాము దూరిన కూడా  వీరికే పిలుపు వస్తూ ఉంటుంది. ఇక నిమిషాల వ్యవధిలో సంఘటన స్థలంలో వారి పోయి ఎంతో జాగ్రత్తగా పాములను పట్టేస్తూ ఉంటారు. వాటిని అటవీ ప్రాంతాలలో వదిలేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవలే టీమ్బీర్వా అనే ప్రాంతంలో పాము ఉంది అనే సమాచారాన్ని అందుకున్నాడు ల్యూక్ హంటి అనే స్నేక్ క్యాచర్. ఈ ప్రాంతానికి చేరుకొని మొత్తం పాము ఎక్కడ ఉందో అని వెతకడం ప్రారంభించాడు.

 అయితే అక్కడ ఏ పాము కనిపించలేదు. కానీ ఆశ్చర్యకరంగా పాము కుబుసంలతో ఏకంగా మూడు పెద్ద బ్యాగులు నిండిపోయాయి అని చెప్పాలి. 32 కూబుషాలు దొరికాయి అంటే 32 పాములు ఉన్నట్లు కాదని చెప్పుకొచ్చాడు సదరు స్నేక్ క్యాచర్. వివిధ వయసుల్లో పాములు కుబుసాలు విడుస్తాయని  చెప్పుకొచ్చాడు. అయితే ఎంత వెతికినా ఆ ఇంట్లో పాము మాత్రం దొరకలేదు అని చెప్పాలి.. ఏమైనప్పటికీ పాము కుబుసాలు భారీగా బయటపడడంతో ఆ కుటుంబ సభ్యులందరూ ఎప్పుడు ఏ క్షణంలో పాము వస్తుందో అని భయపడుతూనే బ్రతుకుతున్నారు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: