భానుడి ఉగ్రరూపం.. 5 గురు మృతి.. ఎక్కడంటే?

praveen
గత కొంతకాలం నుంచి భారత్ లో వర్షాలు ఏ రేంజిలో కురుస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారీగా కురుస్తున్న వర్షాలకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు సైతం ప్రస్తుతం నిండుకుండలా మారిపోయాయ్. అంతేకాదు సామర్థ్యానికి మించి వరదనీరు చేరుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అధికారులు ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. ఇక మరోవైపు భారీగా కురుస్తున్న వర్షాలతో ఎన్నో ప్రాంతాలు వరదల్లో చిక్కుకుపోయాయి. జనజీవనం స్తంభించిపోయింది. ఇలాంటి సమయంలో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయారు అని చెప్పాలి.

 వర్షాలు తగ్గి వరదల నుంచి తమకు విముక్తి ఎప్పుడు వస్తుందా అని దేవుడిని వేడుకుంటున్నారూ ఎంతో మంది ప్రజలు. అయితే అటు అగ్ర దేశమైన బ్రిటన్ లో కూడా ప్రజలందరూ కూడా ఇలాగే విలవిలలాడిపోతూ ఉన్నారు. కానీ ఈ వర్షాల కారణంగా కాదు ఎండల కారణంగా మునుపెన్నడూ లేనివిధంగా బ్రిటన్లో భానుడి ఉగ్రరూపం ప్రస్తుతం ప్రతి ఒక్కరిని బెంబేలెత్తిస్తోంది. రోజురోజుకీ ఎండల తీవ్రత పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్నారు అనే చెప్పాలి. బ్రిటన్ లోని  హీట్ వేవ్ ఎమర్జెన్సీ ప్రకటించిన పరిస్థితి కూడా ఉంది.

 అయితే బానుడి ప్రతాపానికి అల్లాడి పోతున్న బ్రిటన్ ప్రజలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు నుంచి ఉపశమనం పొందడానికి నదులు సరస్సులు బీచ్లకు పరుగులు పెడుతూ ఉండడం గమనార్హం. ఇలాంటి సమయం లోనే నదులు సరస్సుల లో దిగిన ఐదుగురు వ్యక్తులు చివరికి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడింది. బ్రిటన్ లోని హిత్రోలో అత్యధికం గా 40.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.  2019లో బ్రిటన్లో 39.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా ఇప్పటి వరకు అదే అత్యధికం గా కొనసాగింది  ఇప్పుడు మాత్రం అంతకు మించి అనే రేంజ్ లోనే ఎండలు దంచి కొడుతున్నాయ్ అక్కడ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: