వైసీపీ నుంచి ఆ పెద్ద త‌ల‌కాయ్ అవుట్‌.. ?

frame వైసీపీ నుంచి ఆ పెద్ద త‌ల‌కాయ్ అవుట్‌.. ?

RAMAKRISHNA S.S.
- ( ఉత్త‌రాంధ్ర‌ - ఇండియా హెరాల్డ్ ) . . .


ఆంధ్రప్రదేశ్లో గత ఏడాది స్థల పత్రిక ఎన్నికల తర్వాత పలువురు వైసిపి నాయకులు ఆ పార్టీ నుంచి బయటికి వచ్చారు. ఎన్నికలలో వైసీపీ ఘోర ప‌రాజ‌యం పాలవడంతో వైసిపి నుంచి పలువురు మాజీ మంత్రులు .. మాజీ ఎమ్మెల్యేలు .. వైసీపీలో కీలక పదవులు అనుభవించిన వారు .. జిల్లా పార్టీ అధ్యక్షులు చివరకు రాజ్యసభ సభ్యులుగా ఉన్నవారు సైతం వైసీపీని వీడి కూటమి పార్టీలలో చేరిపోతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు వైసీపీలో మరో పెద్ద తలకాయ కూడా పార్టీని వేడెందుకు సిద్ధమవుతోందా ? అంటే అవును అన్న చర్చలు వైసిపి వర్గాలలోనే వినిపిస్తున్నాయి. ఆ పెద్ద తలకాయ ఎవరో కాదు ? శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. గత ఎన్నికలలో ఓటమి తర్వాత ధర్మాన పార్టీ కార్యక్రమాలకు పూర్తి దూరంగా ఉంటూ వచ్చారు. పార్టీ కార్యక్రమాలలో యాక్టివ్ కావాలని జగన్ సూచించినా ధర్మాన అసలు పట్టించుకోలేదు.


ఈ క్రమంలోనే ధర్మాన వైఖరితో జగన్ తీవ్రంగా అసహనం వ్యక్తం చేయడంతో పాటు విసిగిపోయినట్టు తెలుస్తుంది. తాజాగా పొలిటికల్ అడ్వైజరి కమిటీలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన తమ్మినేని సీతారాంకు అవకాశం కల్పించారు. ధర్మాన ప్రసాదరావు పేరును అసలు పరిగణలోకి తీసుకోలేదు. ధర్మాన తీరు మార్కపోతే శ్రీకాకుళం జిల్లా పార్టీ పగ్గాలు మరో నేతకు ఇవ్వడంతో పాటు ... శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా మరొకరికి అవకాశం కల్పిస్తారు అన్న‌ వైసిపి వర్గాలలో ప్రచారం జరుగుతుంది. ధర్మాన కృష్ణ దాస్ లేదా సీదిరి అప్పలరాజు లేదా రెడ్డి శాంతి లేదా తమ్మినేని సీతారాం లాంటి నాయకులకు శ్రీకాకుళం జిల్లా పార్టీ ప‌గ్గాలు అప్పగించే ఆలోచన లో జగన్ ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. వైసీపీ నుంచి బయటకు వస్తే ధర్మాన కూటమీ పార్టీలలో చేరే ఆలోచనలు ఉన్నట్టు కూడా శ్రీకాకుళం జిల్లా రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: