
కళ్లు చెదిరేలా ' అఖండ 2 - తాండవం ' ప్రి రిలీజ్ బిజినెస్...!
నందమూరి నటసింహ బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే ఇటు సినీ ప్రేమికులతో పాటు అటు ట్రేడ్ వర్గాలలో ఎలాంటి అంచనాలు ? ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా సింహా సూపర్ డూపర్ హిట్ అయింది. రెండో సినిమాగా వచ్చిన లెజెండ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ రెండు సినిమాల తర్వాత ముచ్చటగా మూడో సినిమాగా తెరకెక్కిన అఖండ అయితే థియేటర్లలో పూనకాలతో ప్రేక్షకులకు పూనకం తెప్పించింది. మరి ముఖ్యంగా కరోనా టైం లో అఖండ సాధించిన అప్రతహత విజయం అద్భుతం అని చెప్పాలి. ఇప్పుడు బోయపాటి బాలయ్య కాంబినేషన్లో వస్తున్న నాలుగో సినిమా అఖండ 2 - తాండవం ఈ సినిమాపై తెలుగు సినిమా ప్రేమికుల తో పాటు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే అఖండ 2 - తాండవం సినిమాను ఈ యేడాది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
అఖండ 2 తాండవంకు ఆంధ్రప్రదేశ్ - తెలంగాణలో అదిరిపోయే రేట్లకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఎంక్వయిరీలు వస్తున్నట్లు తెలుస్తోంది. వైజాగ్ .. గోదావరి జిల్లాలో కృష్ణ - గుంటూరు అటు నైజాంతో పాటు ఓవర్సీస్ లో బాలయ్య గత సినిమాలుకు జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ రేట్లకు అఖండ 2 తాండవం ప్రి రిలీజ్ బిజినెస్ ఎంక్వయిరీలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకునే సినిమాగా అఖండ 2 రికార్డులకు ఎక్కుతుందని ట్రేడ్ వర్గాలు చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా లో సంయుక్త మీనన్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా .. మరో ఇద్దరు హీరోయిన్లు కూడా కీలక పాత్రలు పోషిస్తారని తెలుస్తోంది.