
ఏపీ మంత్రుల పేషీల్లో చంద్రబాబు మార్క్ నిఘా... అడ్డంగా దొరికేశారా ...?
ఆంధ్రప్రదేశ్ మంత్రుల పేషీల్లో ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కొంతమంది మంత్రుల పేషీల్లో అతిగా ప్రవర్తిస్తున్న వ్యక్తిగత సిబ్బందితోపాటుగా ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కూడా నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. పేషీల్లో అవినీతి పెరిగింది అనే ఆరోపణల నేపథ్యంలో ఇటీవల అంతర్గత విచారణ జరిగింది. ఈ సందర్భంగా పలువురు ఓఎస్డీలపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీనితో విచారణ నివేదిక అందుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కొల్లు రవీంద్ర ఓ ఎస్ డి విషయం తెలుసుకుని తప్పుకున్నారు. వివాదాస్పద అధికారిగా ఆయనకు ముందు నుంచి పేరు ఉంది. ఇక ఇతర పేషీల్లో కూడా కొంతమంది ఓ ఎస్ డి లో ఇలాగే ప్రవర్తిస్తున్నారని అలాగే కొంతమంది పిఎస్ లు కూడా అవినీతికి పాల్పడుతున్నారు అనే ఆరోపణలు ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరాయి.
దీనితో రాబోయే వారం రోజుల్లో కీలక శాఖలలో మార్పులు ఉండే అవకాశాలు ఉండొచ్చని భావిస్తున్నారు. అలాగే వ్యక్తిగత సిబ్బంది కూడా అతిగా ప్రవర్తిస్తున్నారని.. పేషీలకు వచ్చిన వారిని గౌరవించడం లేదని నివేదిక కూడా చంద్రబాబు వద్దకు చేరింది. కొంతమంది టీడీపీ సీనియర్ మంత్రుల పేషీల్లో ఉన్న వ్యక్తిగత సిబ్బందిపై దృష్టి పెట్టారు చంద్రబాబు నాయుడు. గతంలో అనిత వ్యక్తిగత పీఏను అనిత పక్కకు తప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరికొన్ని పేషీల్లో కూడా ఈ మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా హోం మంత్రి పేషీలోనే తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అలాగే సచివాలయం ఎంట్రీ పాసులు విషయంలో కూడా కొంతమంది సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారు అనే ఆరోపణల సైతం వినపడుతున్నాయి. దీనిపై ఇటీవల సచివాలయంలో కలకలం రేగింది.