
చిరు సినిమాకు అనిల్ రావిపూడికి కళ్లు చెదిరే రెమ్యునరేషన్.. ఎన్ని కోట్లో తెలుసా..!
టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస విజయవంతమైన డైరెక్టర్లలో యువ దర్శకుడు అనిల్ రావిపూడి ఒకరు. పదేళ్ల క్రితం నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన పటాస్ సినిమాతో మెగా ఫోన్ పట్టిన దర్శకుడు అనిల్ రావిపూడి తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ కొట్టారు. చాలా ఏళ్లపాటు సరైన హిట్ లేని కళ్యాణ్ రామ్ కు పటాస్ రూపంలో అదిరిపోయే సక్సెస్ దక్కింది. అంతకుముందు అనిల్ రావిపూడి .. శ్రీను వైట్ల తో పాటు కొందరు డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్గా పనిచేశారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి వరుస పెట్టి సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేస్తూ వచ్చారు. రవితేజతో రాజా ది గ్రేట్ .. మెగా హీరో సాయిధరమ్ తేజ్ తో సుప్రీం .. ఎఫ్ 2 - ఎఫ్ 3 సినిమాలతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సరిలేరు నీకెవ్వరు తాజాగా వెంకటేష్ తో సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం లాంటి అదిరిపోయే కామెడీ హిట్ సినిమా తెరకెక్కించి టాలీవుడ్ లో అదరగొడుతున్నారు.
కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏకంగా రు. 300 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టింది అంటే మామూలు విషయం కాదు. ఈ సినిమాతో అనిల్ రావిపూడి పేరు మార్మోగిపోతోంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంక్రాంతి రఫ్ ఆడిద్దాం అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి రు. 30 నుంచి 35 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. ఇక చిరంజీవికి ఈ సినిమాకు గాను మొత్తం 70 కోట్లకు పైగా రెమ్యునరేషన్ ముడుతున్నట్టు తెలుస్తుంది. పైగా తన కుమార్తె సుష్మిత బ్యానర్ పేరు యాడ్ చేసినందుకు ఆమెకు లాభాల్లో వాటా కూడా ఇస్తారని అంటున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా ఓవరాల బడ్జెట్ 200 కోట్లు పైనే అని తెలుస్తోంది.