తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. ఈ నటి తేజ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చందమామ మూవీ తో మొదటి కమర్షియల్ విజయాన్ని కాజల్ అందుకుంది. ఆ తర్వాత ఈమె మగధీర సినిమాతో ఇంట్రెస్ట్ హిట్ ను అందుకుంది. ఇలా ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో కెరియర్ను మొదలు పెట్టిన కొత్త లోనే అద్భుతమైన స్థాయిలో విజయాలను అందుకుంటూ రావడంతో ఈమెకు చాలా తక్కువ కాలంలోనే తెలుగులో స్టార్ హీరోయిన్ క్రేజ్ వచ్చేసింది.
ఆ తర్వాత కూడా ఈమె చాలా కాలం పాటు మంచి విజయాలను అందుకుంటూ కెరియర్లో ఎప్పుడూ వెనక్కు తిరిగి చూసుకోకుండా కెరీర్ను ముందుకు సాగించింది. ఇకపోతే కొంత కాలం క్రితమే ఈమె పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా కాజల్ సినిమాల్లో కంటిన్యూ అయింది. ఇక పెళ్లి తర్వాత కొంత కాలానికి ఈమె గర్భం దాల్చడంతో కొంత కాలం పాటు ఈమె సినిమాలకు దూరంగా ఉంది. ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ ప్రస్తుతం కూడా సినిమాల్లో నటిస్తుంది. ఇకపోతే ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ బ్యూటీ ఒక విషయంలో మాత్రం పెద్దగా సక్సెస్ కాలేక పోతుంది.
అదే విషయంలో అనుకుంటున్నారా ..? లేడీ ఓరియంటెడ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకునే విషయంలో ఇప్పటి వరకు సక్సెస్ కాలేదు. ఈమె ఇప్పటివరకు చాలా లేడీ ఓరియంటల్ సినిమాల్లో నటించింది. కానీ ఈమెకు లేడీ ఓరియంటెడ్ సినిమాల ద్వారా అద్భుతమైన విజయం మాత్రం దక్కలేదు. కొంత కాలం క్రితం ఈమె సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఆ మూవీ కూడా ఈమెకు మంచి విజయాన్ని అందించలేక పోయింది. అలా సత్యభామ సినిమా కూడా కాజల్ కి నిరాశనే మిగిల్చింది.