పాపం బిడ్డా.. నవ్వుతూ పుట్టింది?
దీని పేరు బైలెటరల్ మాక్రోస్టోమియా.. ఇక ఇలాంటి అరుదైన లోపం చాలా తక్కువ మంది శిశువుల్లో మాత్రమే కనిపిస్తుందట. బిడ్డ కడుపులో ఉన్న సమయం లో ఏడో వారం లో కణజాలం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచం మొత్తంలో ఇప్పటి వరకు కేవలం ఇలాంటి కేసులు 14 మాత్రమే నమోదు కావడం గమనార్హం. ఇక ఇటీవలే ఆస్ట్రేలియాలో ఇలాంటి తరహా ఘటన జరిగింది. క్రిస్టియానా, బ్లేజియా లకు ఒక బిడ్డ పుట్టింది. ఆమె పేరు ఎయిలా.2021 లో జన్మించిన చిన్నారి పుట్టినప్పుడు ఆ బిడ్డ ఏడవలేదు. పైగా పెద్దల దగ్గర అసాధారణ స్థితి నెలకొంది. దీంతో తల్లిదండ్రులు కంగారుపడ్డారు.
డాక్టర్ పరిశీలించి అది బైలెటరల్ మాక్రోస్టోమియాగా తెల్చారు. నవ్వకుండానె పెదాలు సాగినట్లు కనిపిస్తాయి. అయితే ప్రస్తుతం సర్జరీతో బిడ్డ పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉన్న పెద్దయిన తర్వాత మాత్రం మళ్లీ అదే స్థితి ఏర్పడవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెటిజన్లు నవ్వే వాళ్ళు నవ్వనివ్వండి అంటూ కామెంట్ చేస్తూన్నారు నెటిజన్లు.