రష్యాకు షాక్.. వాళ్లకి ట్రైనింగ్ ఇస్తున్న అమెరికా?

praveen
అగ్ర దేశమైన  రష్యా చిన్న దేశమైన ఉక్రెయిన్ పై ఏ రేంజ్ లో యుద్ధం చేస్తుందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు  ఉక్రెయిన్ ఎడతెరిపి లేకుండా దాడి చేసిన నేపథ్యం లో ప్రస్తుతం అక్కడ అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. బాంబుల  తో  మారణ హోమాన్ని సృష్టిస్తున్న రష్యా రాక్షస ఆనందాన్ని పొందుతుంది అని చెప్పాలి. ఈ క్రమం లోనే ప్రస్తుతం రష్యా సైన్యం ఉక్రెయిన్ పై మరింత విరుచుకు పడుతుంది. ఇలాంటి సమయం లో మొదటి నుంచి ఉక్రెయిన్ కి అండగా ఉంటాను అంటూ చెప్పిన అమెరికా రహస్యంగా ఆయుధ సహకారం అందిస్తుంది అనే విషయం తెలుస్తుంది.
 ఉక్రెయిన్ విమానాలను ధ్వంసం చేసేందుకు.. అధునాతనమైన ఆయుధాలను అందిస్తూ ఉంది అమెరిక. అదే సమయం లో ఉక్రెయిన్ కు మద్దతు గా రష్యా పై ఆర్థిక పరమైన సాంకేతిక పరమైన యుద్ధం కూడా చేస్తుంది అమెరికా అనే విషయం తెలిసిందే. అమెరికా అండదండలతోనే ఉక్రెయిన్ సైనికులు రష్యాతో సమర్థవంతంగా పోరాటం చేయగలుగుతున్నారు. మొన్నటి వరకు ఆయుధ సరఫరాతో అండగా నిలుస్తున్న అమెరికా ఇకపై మరింత క్రియాశీలకంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది అని తెలుస్తోంది.

 ఇప్పటికే అధిక సంఖ్యలో ఆయుధాలు మందుగుండు సామాగ్రిని ఉక్రెయిన్ సైన్యానికి పంపడంతో పాటు వాటిని వినియోగించడం లో కూడా శిక్షణ ఇవ్వాలని అమెరికా నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. 80 కోట్ల డాలర్ల ఆయుధ ప్యాకేజీతో పాటు శిక్షణ ఇచ్చేందుకు కూడా నిర్ణయించుకుంది. ఈ ప్యాకేజీలో  18 హోవిట్జర్లు (155ఎంఎం), 40 వేల ఆర్టిల్లరీ రౌండ్లు, మానవరహిత తీరరక్షక నౌకలు, 10 ఏఎన్‌/టీపీక్యూ-36 ఫిరంగి నిరోధక రాడార్లు, 500 జావెలిన్‌ క్షిపణులు, 300 స్విచ్‌బ్లేడ్‌లు, వందల సంఖ్యలో వాహనాలు, భారీమొత్తంలో మందుగుండు సామగ్రితో పాటు 11 ఎంఐ-17 హెలికాప్టర్లనూ ఉక్రెయిన్‌కు పంపించనుంది. అంతేకాకుండా ఎంపిక చేసిన సైనికులకు వేగంగా శిక్షణ కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: