తైవాన్ అలర్ట్.. ఒకవేళ యుద్ధమే వస్తే?

praveen
నక్క జిత్తుల మారి చైనా ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశంగా ఎదిగేందుకు నెంబర్ వన్ స్థానంలో కొనసాగేందుకు ఎప్పుడూ దొడ్డి దారులను వెతుకుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే పొరుగు దేశాల పై తమ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అయితే  ఈ క్రమంలోనే ఇప్పటికే పొరుగున ఉన్న అన్ని దేశాలతో కూడా వివాదాలు పెట్టుకుంది చైనా. అదే సమయంలో ఇప్పటికే స్వతంత్ర దేశంగా ఉన్న హాంకాంగ్ ను చైనా భూభాగం లాగానే మార్చుకుంది.

 దీంతో హాంకాంగ్లో ప్రత్యేక ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇక అక్కడ పాలన మాత్రం చైనా  చెప్పు చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు పొరుగున ఉన్న మరో చిన్న దేశం అయిన తైవాన్  పై చైనా కన్ను పడింది.. ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి తైవాన్ పై ఆధిపత్యం సాధించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది అన్న విషయం తెలిసిందే. సరిహద్దుల్లో భారీగా సైనికులను మోహరించి ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తూ ఉంది. అంతే కాకుండా తైవాన్ గగనతలంలో కి యుద్ధ విమానాలు పంపిస్తూ యుద్ధ పరిస్థితులకు కారణం అవుతూ ఉంది చైనా. ఇక ఇప్పటికే ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ఎంత సంచలనంగా మారింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు రష్యా మిత్ర దేశమైన చైనా కూడా తైవాన్  విషయంలో ఇలాగే వ్యవహరిస్తోంది.

 దీంతో చైనా తో ముప్పు పొంచి ఉందని భావిస్తున్న తైవాన్ ప్రస్తుతం అప్రమత్తం అవుతూ ఉండడం గమనార్హం. ఒకవేళ అనుకోని విధంగా దేశంలో యుద్ధ పరిస్థితులు ఏర్పడితే దేశంలో ఉన్న పౌరులు అందరూ కూడా ఏ విధంగా స్పందించాలి అనే విషయాలను తెలియజేస్తూ తైవాన్ ప్రభుత్వం ఒక హ్యాండ్ బుక్ ని విడుదల చేసింది. స్మార్ట్ఫోన్ అప్లికేషన్ ద్వారా బాంబు షెల్టర్లను కనుక్కోవడం ఇక ఆహార లభ్యత ప్రదేశాలు ప్రథమ చికిత్స చిట్కాలను కూడా ఈ హ్యాండ్ బుక్ లో వివరించడం గమనార్హం. ఇక స్థానిక ఆస్పత్రులు షాపుల సమాచారంతో మరోసారి అన్ని విషయాలను అప్డేట్ చేస్తాను అంటూ అక్కడి ప్రభుత్వం వెల్లడించింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: