షాకింగ్ : అణ్వాయుదాల ప్రయోగానికి సిద్ధమైన పుతిన్?

praveen
ఉక్రెయిన్ రష్యా మధ్య గత కొన్ని రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా యుద్ధం జరుగుతుంది అన్న విషయం తెల్సిందే. చిన్న దేశమైన ఉక్రెయిన్ పై కాస్తయినా మానవత్వం చూపని అగ్ర దేశమైన రష్యా తమ సేనలతో విరుచుకు పడుతూనే ఉంది  అయితే తక్కువ సైన్యాన్ని కలిగి ఉన్నప్పటికీ అటు ఉక్రెయిన్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గకుండా రష్యాకు ధీటుగా పోరాటం చేస్తుందని చెప్పాలి. ఇలా ఇక రష్యా బీకర స్థాయిలో ఉక్రెయిన్ పై విరుచుకుపడుతూ ఉండడంతో ఉక్రెయిన్లో ప్రస్తుతం అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి.

 ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇక ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఎందుకు వస్తుందో అన్నది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఎంతో ఉత్కంఠభరితంగా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇక ఇటీవలే రెండు దేశాల ప్రతినిధులు కూడా చర్చలకు  సిద్ధమయ్యారు. ఇక రష్యా ఉక్రేయిన్ ప్రతినిధుల మధ్య చర్చలు విఫలం అయినట్లు తెలుస్తోంది  సుమారు నాలుగు గంటలపాటు సాగిన సమాజంలో రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు  తక్షణమే రష్యా కాల్పుల విరమణ చేసి తమ దేశం నుంచి వెనక్కి వెళ్లాలి అంటూఉక్రెయిన్ చర్చలో డిమాండ్ చేసింది.

 క్రిమియా నుంచి రష్యా సైన్యం వెనక్కి పోవాలని పట్టుబట్టింది ఉక్రెయిన్. ఇక ఉక్రెయిన్ నాటోలో చేరబోనని లిఖితపూర్వక హామీ ఇవ్వాలి అంటూ రష్యా ప్రతినిధులు పట్టుబడ్డారు. అయితే ఈ విషయంలో ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. రష్యా ఉక్రెయిన్ మధ్య చర్చలు కాస్త విఫలం అయ్యాయి. అయితే మొన్నటి  వరకు ప్రపంచ దేశాలు రష్యా పై ఆంక్షలు విధిస్తే.. ఇప్పుడు రష్యా కూడా ఆ చర్యలకు సిద్ధమైంది. 36 దేశాలు విమానాలను నిషేధం విధిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. అయితే ఇప్పటికే యూరోపియన్ యూనియన్ తమ గగనతలంలో కి రష్యా విమానాలను నిషేధించాయి. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ త్రివిధ దళాల అధ్యక్షులతో  సమావేశం అయ్యారు. ఈ క్రమంలోనే అణు ఆయుధాల ప్రయోగంపై చర్చించారు. అయితే బెలారస్ లో అణు ఆయుధాలను మొహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: