భారత్ పై చైనా దారుణమైన పోస్ట్.. చివరికి?

Suma Kallamadi
చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన కేంద్ర రాజకీయ, న్యాయ వ్యవహారాల కమిషన్.. చైనీస్ సోషల్ మీడియా వెబ్సైటు అయిన "వీబో" లో ఇండియా యొక్క కరోనా మరణాలను ఉద్దేశిస్తూ ఒక దారుణమైన పోస్ట్ పెట్టింది. ఇటీవలే చైనా ప్రభుత్వం ఒక రాకెట్ ను లాంచ్ చేయగా.. ఆ రాకెట్ లాంచింగ్ ఫోటోని, భారతదేశంలో కరోనా రోగుల దహన సంస్కారాలకు సంబంధించిన ఫోటోని పక్కపక్కనే జోడించి కేంద్ర రాజకీయ, న్యాయ వ్యవహారాల కమిషన్ ఒక పోస్ట్ పెట్టి.. "చైనా లైటింగ్ ఎ ఫైర్, ఇండియా లైటింగ్ ఎ ఫైర్" అని క్యాప్షన్ జోడించింది.

ఈ పేజీ కి కోటిన్నర ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా.. భారత్ పై పెట్టిన పోస్ట్ చూడగానే వారంతా కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అత్యంత సున్నితమైన విషయంపై ఇలా కనీస కనికరం లేకుండా కామెంట్ చేయడానికి నోరేలా వచ్చిందని చాలామంది చైనీస్ నెటిజన్లు, ఎన్ఆర్ఐలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు వేరువేరు ఫోటోలను కంపేర్ చేస్తూ ఇండియాని ఎగతాళి చేసినందుకుగాను సర్వత్ర పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనితో కమ్యూనిస్టు పార్టీ శనివారం రోజు తాము పెట్టిన పోస్ట్ ని ఆదివారం రోజు డిలీట్ చేసింది.


ఉన్నత హోదాలో ఉన్న సంస్థ నుంచి ఇటువంటి పోస్ట్ రావడం ప్రస్తుతం అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. ఆసుపత్రులలో, స్మశాన వాటికలలో మృతుల బంధువుల ఆర్తనాదాలు ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని కంటతడి పెట్టిస్తున్నాయి. దీనితో భారతీయుల ప్రాణాలను కాపాడేందుకు ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛందంగా చాలామంది ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనా నుంచి ఇటువంటి రెస్పాన్స్ రావడం నిజంగా సిగ్గుచేటు.


మరోవైపు చైనాలో బుద్దిస్ట్ ఆర్గనైజేషన్స్, సోషల్ మీడియా ఆర్గనైజేషన్స్ కలిసి కరోనా పోరుపై భారతదేశానికి సహాయం అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఈ పోస్ట్ గురించి స్పందించిన ఒక చైనీస్ అధికారి.. కేంద్ర రాజకీయ, న్యాయ వ్యవహారాల కమిషన్ తరుపున తాను క్షమాపణ చెబుతున్నానని.. ఆ పోస్ట్ కి చైనీస్ ప్రజలకు ఎలాంటి సంబంధం లేదని.. ఇండియాని అవమానించే ఉద్దేశం చైనీస్ ప్రజలలో అస్సలు లేదని ఆయన చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: