మన వైద్యులకు గాలం వేస్తున్న అమెరికా...!

Gullapally Rajesh
కరోనా వ్యాక్సిన్ కోసం ఇప్పుడు చాలా ఆశగా ఎదురు చూస్తున్నాయి దేశాలు.  అన్ని దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పుడు వ్యాక్సిన్ చాలా అవసరంగా మారింది. అయితే ఈ విషయంలో చాలా దేశాలు ఇప్పుడు వెనకడుగు వేస్తున్నాయి. అమెరిక సహా బ్రిటన్, ఇటలీ వంటి అభివృద్ధి చెందిన దేశాలు వ్యాక్సిన్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నా సరే ఫలితం మాత్రం ఉండటం లేదనే చెప్పవచ్చు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు అమెరికాలో మన ఎన్నారై వైద్యులకు వ్యాక్సిన్ తయారిలో ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాయి అక్కడి కంపెనీలు.
మన శాస్త్రవేత్తలకు కూడా అక్కడ చాలా ప్రాధాన్యత లభిస్తుంది. ఎన్నారై  వైద్యుల విషయంలో ప్రభుత్వాలు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వారికి ఆర్ధిక ప్రోత్సాహం కూడా అందించడం విశేషం. మన దేశంలో కూడా  వైద్యులు ఇప్పుడు దీని కోసం కష్టపడుతున్నారు. ఇదే కాదు... చైనా, బ్రిటన్ సహా పలు దేశాల్లో పని చేసే ఎన్నారై వైద్యుల కోసం ఇప్పుడు గాలం వేస్తుంది అమెరికా. ప్రతిభ ఉన్న శాస్త్రవేత్తలను తమ దేశంలోకి తీసుకుని ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తుంది. దీని  ద్వారా అమెరికా అధ్యక్ష  ఎన్నికల్లో కూడా లాభ పడాలి అని భావిస్తుంది.
మన దేశంలో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఎక్కువగా  ఉంది. కాబట్టి మెరికా కూడా  ఇప్పుడు వ్యాక్సిన్ సహాయం చేయడానికి ముందుకు వస్తుంది. రష్యా సహా పలు దేశాల్లో వ్యాక్సిన్ పై చాలా ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక మన శాస్త్రవేత్తలు అయితే కొన్ని దేశాల్లో చాలా కీలకంగా మారిన సంగతి తెలిసిందే. బ్రిటన్ లో జరుగుతున్న ప్రయోగాలలో మన వాళ్ళే చాలా కీలకంగా ఉన్నారు. దీనితో వందల కోట్ల డాలర్లను ఇచ్చి వారిని తీసుకెళ్ళే విధంగా ప్లాన్ చేస్తుంది అమెరికా సర్కార్. మరి ఇది ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: