అగ్ర రాజ్యం అమెరికా..రష్యా పేరు చెప్తే ఉలిక్కిపడుతుంది..ఎందుకో తెలుసా..!!

VIKRAM
ప్రపంచ దేశాలలో కెల్లా అగ్ర రాజ్య హోదాని అనుభవిస్తున్న ఏకైక దేశం అమెరికా. అన్ని దేశాలకి పెద్దన్న హోదాని వెలగబెట్టే అమెరికా కొన్ని దేశాలపై మాత్రం నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తుంది. తన మాట వినని దేశాలను నయానో భాయనో లొంగదీసుకోవడం అమెరికాకి వెన్నతో పెట్టిన విద్యే. టెక్నాలజీ పరంగా, ఆర్ధిక, అంగ బలాలని లెక్కలు వేస్తే అమెరికా దరిదాపుల్లో ఏ దేశం చేరుకోలేదు అంటే అతిశయోక్తి కాదు. ఎలాంటి పరిణామాలనైనా సమర్ధవంతంగా ఎదుర్కునే శక్తి , సామర్ధ్యాలు అమెరికాకి పుష్కలంగా ఉన్నాయి. అయితే పెద్దన్న పెత్తనం అన్ని దేశాలపై చెల్లుతుంది కానీ రష్యాపై  అమెరికా పప్పులు ఉడకవని అంటున్నారు చరిత్ర కారులు..ఎందుకంటే..
మొదటి, రెండవ ప్రపంచ యుద్దాల సమయంలో సాంకేతిక పరిజ్ఞానం అప్పట్లో మెల్ల మెల్లగా మొదలవుతూ ఉంది. శత్రువులను ఎదుర్కోవడానికి అత్యాధునిక ఆయుధాలతో పాటు అధునాతనమైన పరినాన్ని ఉపయోగించారు. రెండవ ప్రపంచ యుద్దం సమయానికి  అణుబాంబులను అన్ని దేశాలు తయారు చేసినా ఎక్కడా వాటిని ఉపయోగించే అవకాశం రాలేదు. కానీ జపాన్ పై అణుబాంబు ప్రయోగంతో అణుబాంబు ప్రభావం ఎలా ఉంటుందో అందరికి తెలియవచ్చింది.  అమెరికా సైతం రెండు అణుబాంబులు సిద్దం చేసి ఉంచుకోగా, సోవియట్ యూనియన్ మాత్రం అణుబాంబులకంటే 500 ల రెట్లు ప్రభావవంతమైన రెండు హైడ్రోజన్ బాంబులు సిద్దం చేసుకుంది.

ఈ క్రమంలోనే సోవియట్ యూనియన్ నోవయా అనే ద్వీపం పై అణుబాంబును ప్రయోగించగా, భారీ భూకంపంతో సునామీ ఏర్పడింది. ఇప్పటి వరకూ ప్రపంచంలో పేలిన బాంబులలో అత్యంత ప్రభావవంతమైన బాంబు ఇదేనని తెలుస్తుంది. రెండు హైడ్రోజన్ బాబులలో ఒకటి అయ్యిపోగా మరొక బాంబును తమ సంరక్షణకోసం  దాచిపెట్టింది. ఇప్పటికీ ప్రపంచంలో అన్ని దేశాలు రష్యా దగ్గర ఉన్న హైడ్రోజన్ బాంబు పేరు చెప్తేనే హడలి పోతున్నాయి. ఒక్కో సారి అమెరికా రష్యా విషయంలో వెనకడుగు వేసే వేస్తోందంటే ఇదే  దీనికి కారణం రష్యా దాచిపెట్టిన హైద్రేజన్ బాబులేనని అంటున్నారు రాజకీయ పండితులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: