రాజమౌళి ‘బాహుబలి’ గుట్టు విప్పారు..!!

Edari Rama Krishna
తెలుగు చలన చిత్ర సీమలో ఇప్పటి వరకు చేయని ప్రయోగాలు..ఏ సినిమాకు పెట్టని ఖర్చు..దాదాపు రెండున్న సంవత్సరాలు కష్టపడి తీసిన చిత్రం ‘బాహుబలి’. రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన ఈ చిత్రానికి అనుకున్న స్థాయికంటే ఎక్కువ రిజల్ట్ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా నాలుగు భాషల్లో 4000 థియేటర్లో ఈ చిత్రాన్ని ప్రదర్శంచి రికార్డు మోతలు మోగించారు. ఇప్పటి వరకు భారత చలన చిత్ర చరిత్రలో  రూ.550 కోట్ల కలెక్షన్స్ చేసి అటు తమిళ  ఇటు హిందీ భాషల్లో అప్పటి వరకు ఉన్న రికార్డులు బద్దలు కొట్టేసింది. ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి అద్భుతమైన వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్స్‌ ను ఉపయోగించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ టెక్నాలజీ గురించి దానికి వెనుక కష్టాన్ని గురించి  రాజమౌళి అభిమానులతో పంచుకున్నారు. మకుత అనే సంస్థ ఈ చిత్రంలో 50 శాతం కన్నా ఎక్కువ విజువల్‌ ఎఫెక్ట్స్‌ని రూపొందించింది. ఈ చిత్రానికి ఇంత భారీ హంగులు వచ్చింది ఈ విజువల్‌ గ్రాఫిక్స్‌ వల్లే. ఈ విభాగంలో పని చేసిన వారికి దర్శకులు రాజమౌళి కృతజ్ఞతలు తెలిపారు. ఇక ప్రపంచవ్యాప్తంగా తెలుగు,తమిళ, హిందీ, మళయాళ భాషల్లో రిలీజై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రం ‘బాహుబలి’. ఈ చిత్రం ఇప్పుడు ఇంటర్నేషనల్ వెర్షన్స్ పై దృష్టి పెట్టింది. అందులో భాగంగా చైనీస్, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

బాహుబలి పోస్టర్


ఇప్పటి వరకు తెలుగు చిత్రాలు 100 కోట్లు టార్గెట్ పెట్టుకున్న సినిమాలే ఉండేవి ‘బాహుబలి’ చిత్రం తర్వాత ఆ టార్గెట్ సునాయాసంగా మించి పోయి రికార్డు సృష్టించింది. తెలుగు సినిమాలు కూడా హాలీవుడ్ రేంజ్ లో తీయగలరు అన్న దీమా రాజమౌళి తీసుకు వచ్చారు అనడంలో అతిశయెక్తి లేదు. ఇంటర్నేషనల్ మార్కెట్లో మినిమం వంద కోట్లు సంపాదించాలని టార్గెట్ చేసినట్లు చెప్తున్నారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ ప్రేక్షకులు చూడటం కోసం ప్రస్తుతం ఎడిటింగ్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆ ప్రేక్షకులను అందుకోవాలంటే… అంతర్జాతీయ నిపుణులతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది.  ఇక బాహుబలి 2 చిత్రాన్ని కూడా మరిన్ని హంగులతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి జక్కన్న ప్రయత్నిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: