అక్కినేని ఫ్యామిలీ వారసుడిగా ఈ తరం యువ హీరోగా త్వరలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్న హీరో అక్కినేని అఖిల్. ‘మనం’ సినిమాలో 2 నిమిషాలు కనిపించి అందరినీ ఆకట్టుకున్న అఖిల్ సోలో హీరోగా వి.వి.వినాయక్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘అఖిల్ ’ విజయదశమి కానుకగా విడుదల కాబోతున్నది. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నితిన్ నిర్మిస్తున్నారు. సాయేషా సైగల్ కథానాయిక. అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా.. నాగార్జున తనయుడిగా అఖిల్ చిత్రం ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి. ఇమ నాగార్జున పుట్టిన రోజు వేడుకల సందర్భంగా విడుదలైన ‘అఖిల్’ టైటిల్ ఖరారు చేస్తూ ఓ టీజర్ విడుదల అయ్యింది.
ఇక ఈ టీజర్ అఖిల్ రఫ్ అండ్ టఫ్ గా కనిపిస్తున్నాడు. ఒకప్పుడు శివ చిత్రంలో నాగార్జున కనిపించినట్లు చాలా సీరియస్ లుకింగ్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమా స్టోరీపై అప్పుడు రక రకాల రూమర్స్ పుట్టుకు వస్తున్నాయ... ‘అఖిల్’ – ది పవర్ ఆఫ్ జువా .. అంటూ టీజర్ లో చేసిన హడావిడి కూడా ఓ రేంజ్లో ఉంది. ఇక పోతే టీజర్ లో అఖిల్ ఎనర్జీ చూసిన వాళ్లు సినిమాలో యాక్షన్‌కు కొదవలేదన్న నిర్ణయానికి వచ్చేశారు. ఈ సినిమాలో మనోడు లవ్ కోసం ఎంతటి రిస్క్ అయినా ఫేస్ చేస్తాడన్ని విషయం తెలిసిపోతుంది.. కాకపోతే టీజర్ చూసిన వాళ్లకు చిన్న అనుమానం కలుగుతుంది.. అదే అఖిల్ డ్యాన్స్ ఎందుకంటే టీజర్ ఎక్కడా డ్యాన్స్ పర్ఫామెన్స్ కు సంబంధించిన కనిపించలేదు.. మరి డ్యాన్స్ అంతంత మాత్రమేనా.. లేదా నేటి యువహీరోలతో పోటీ పడేలా ఉంటుందా అన్న విషయం తెలియాల్సి ఉంది.
అఖిల్ సినిమ కొత్త పోస్టర్
టాలీవుడ్లో టీజర్ చూస్తేనే స్టోరీలు చెప్పేస్తారు. అంతెందుకు శ్రీమంతుడు టీజర్ కూడా రాకుండానే మనోళ్లు స్టోరీ కూపీ లాగేశారు. అఖిల్ మూవీ టీజర్లో మాత్రం అస్సలు స్టోరీ ఏంటనేది తెలియకుండా జాగ్రత్తపడినట్టు కనిపిస్తోంది. సినిమా సోషియా ఫాంటసీనా లేదా యక్షన్ మూవీనా అన్నదానిపై కూడా క్లారిటీ లేదు. త్వరలోనే ఆడియో రిలీజ్ అవుతుండడంతో అప్పటి నుంచి సినిమా రిలీజ్ వరకు రెండు, మూడు ట్రైలర్లు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ ట్రైలర్లలో అయినా సినిమా గురించి క్లారిటీ వస్తుందని అంచనా వేస్తున్నారు.