తాగి యోగాసనాలు వేసిన హీరో..!!

Edari Rama Krishna
నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో.. నరులెవరూ తిరగని ఆ రూట్లో నే నడిచెదరో.. అన్న చందంగా ఉంది తమిళ హీరో, డీఎండీకే అధినే వియజ్ కాంత్. విజయ్ గతంలో యాక్షన్ హీరోగా అందరికీ పరిచయమే తర్వాత రాజకీయ రంగంలోకి వచ్చి నానా హంగామా చేశాడు. ఎప్పుడూ వివాదాస్పదాల్లో ఉండే విజయ్ కాంత్ నిన్న యోగా డే సందర్భంగా తెగ హల్ చల్ చేశాడు. యోగా సమయంలో కాస్త ఊగుతూ తూగుతూ కనిపించినట్లు తెలుస్తుంది..? యోగాసాసనాలు చిత్ర విచిత్రంగా చేయడం మొదలు పెట్టాడట.


యోగ ఆసనాలు వేస్తున్న హీరో విజయ్ కాంత్


అంతే కాదు ఆయన బాడీ కంట్రోల్ చేయడానికి నానా బాధ పడ్డాడు.ఆయన కళ్లు బాగా ఎరుపెక్కి ఉన్నాయట. మొత్తానికి యోగా కార్యక్రమానికి రానైతే వచ్చాడు కాని తన బండారం బయటపడుతుందేమో అని నానా బాధలు పడి మొత్తానికి మమా అనిపించుకున్నాడు. ఈయన చేష్టలకు పక్కనున్న వారు కాస్త ఇబ్బంది పడి సెలబ్రెటీలు కూడా ఇలా చేస్తే ఎలా అని అనుకున్నారట..?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: